గజ్జె ఘల్లుమంది..
సిరిసిరిమువ్వలు కట్టుకున్న చిన్నారి అడుగులు.. నాట్యంలో అందెవేసిన మువ్వలు.. జతకలసిన వేళ అందెల రవం మార్మోగింది. కూచిపూడి నాట్య సీమలో వికసించిన కుసుమాల అభినయంతో రాజధాని మరోసారి పులకించింది. అరుణ వర్ణంలో కొందరు.. తొగరు రంగులో ఇంకొందరు.. పచ్చందన చందనంలో మరికొందరు.. ఇలా రంగురంగుల సంప్రదాయ వస్త్రాల్లో కూచిపూడి ప్రాభవాన్ని కళ్ల ముందుంచారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం కన్నులపండువగా సాగింది.