అనుమతుల మేరకే బృందావన్ నిర్మాణం
సమయమొచ్చినప్పుడు
‘వారి’ పేర్లు వెల్లడిస్తాం
విలేకరుల సమావేశంలో గండ్ర సోదరులు
హన్మకొండ : బృందావన్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించిన తమను డబ్బు అడిగిన వివరాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతామని గండ్ర వెంకటరమణరెడ్డి, గండ్ర భూపాల్‌రెడ్డి చెప్పారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే బృందావన్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టినా, వడ్డేపల్లి అభివృద్ధి కమిటీ పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
అయితే, ఈ ఆరోపణలపై స్పందించకుంటే తాము తప్పు చేసిన వారమవుతామనే భావనతో వాస్తవాలు చెప్పేందుకు వచ్చామని తెలిపారు. హన్మకొండ వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్లో బిల్డర్ గండ్ర భూ పాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది బ్లాక్‌లో 270 ఫ్లాట్లతో బృందావన్ అపార్్టమెంట్ నిర్మించే క్రమంలో రోడ్డు ఆ క్రమించామని ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. ‘కుడా’ మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు 40 ఫీట్లే ఉందని.. కొత్త మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే 60 ఫీట్ల రోడ్డు కోసం స్థలం వదిలేందుకు సిద్ధమన్నారు. 60 ఫీట్లు రోడ్డుకు వదిలి స్థలం విక్రయించినట్లు చెబుతుండడంపై స్పందిస్తూ డాక్యుమెంట్లలో పొరపాటున 60 అడుగులుగా పడితే సరిచేయించామని తెలిపారు. ఇక డ్రె యినేజీని బల్దియా ఆధ్వర్యాన నిర్మిస్తామని చెప్పగా రూ.12.40 లక్షలు డీడీ ద్వారా చె ల్లించామని అన్నారు. మురుగు నీరు పోవడాని కి సొంత ఖర్చులతో పైపులు వేశామని చె ప్పారు. ఈ ఏడాది మార్చి 15న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే బల్ది యా అధికారులు నాలుగు అభ్యంతరాలు చె ప్పారన్నారు. అయితే, వాటిని సరిచేసి మరోసారి దరఖాస్తు చేసుకుంటే జూలై 26వ తేదీన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారని వెంకటరమణారెడ్డి, భూపాల్‌రెడ్డి వెల్లడించారు.