శశికళ, ఇళవరసి, సుధాకరన్ దోషులే
బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె స్నేహితురాలు శశికళను కూడా న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. వీరిద్దరితో పాటు పెంపుడు కుమారుడుసుధాకరన్, ఇళవరసిలు కూడా దోషులుగా తేల్చినట్లు ఎస్పీపీ భవానీ సింగ్ తెలిపారు. జయలలితను బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే.
పురచ్చితలైవిగా, అమ్మగా పేరొందిన జయలలిత 1991లో మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 43 ఏళ్ల వయసులోనే సీఎం పగ్గాలు స్వీకరించిన జయలలిత 96 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో జయలలిత భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో నాటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు.