'రుణాలు రెన్యువల్‌కు ఆటంకాలు ఉండవు'
హైదరాబాద్: ఈ ఏడాది రైతులకు రుణాలు రెన్యువల్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. రుణం ఉపసంహరణ పథకం కింద లబ్ధి పొందిన వారందరూ రుణాలను రెన్యువల్ చేసుకోవచ్చుని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మిగిలిన మొత్తాన్ని ఇంకా రైతులు చెల్లించకపోయినా రెన్యువల్ చేయడానికి బ్యాంకులు అంగీకరించాయన్నారు. డ్వాక్రా సంఘాలకు ఈ ఏడాది రూ. 15,880 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఎస్సీ, ఎస్టీ రుణాలకు బ్యాంకులు సహకరించడం లేదన్నారు. వాటిపై దృష్టి సారించాలని బ్యాంకు అధికారులను కోరినట్టు ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు.