loaning
-
బ్రాండెడ్ గృహాలదే బాజా
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోళ్లలో బ్రాండ్ మోగిపోతుంది. నాణ్యత, గడువులోగా నిర్మాణాల పూర్తి, ఆధునిక వసతుల కల్పన, రుణాల మంజూరులో ప్రాధాన్యత.. కారణాలేవైనా బ్రాండెడ్ నిర్మాణ సంస్థల గృహాలకు డిమాండ్ పెరిగింది. రెరా, జీఎస్టీ వంటి నిర్మాణాత్మక విధానాల అమలు తర్వాత వీటి ఆధిపత్యం పెరిగింది. లగ్జరీతో పాటు అఫర్డబుల్, మధ్య ఆదాయ విభాగాల గృహాలను నిర్మిస్తుండటంతో లిస్టెడ్, ప్రముఖ డెవలపర్ల విక్రయాలు ప్రతికూల సమయంలోనూ జోరుగా సాగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2021 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్–డిసెంబర్) 93,140 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో ఎనిమిది లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల వాటా 22 శాతంగా ఉండగా.. ప్రధానమైన అన్–లిస్టెడ్ కంపెనీల విక్రయాలు 18 శాతం, ఇతర కంపెనీల విక్రయాలు 60 శాతంగా ఉన్నాయి. 2017 ఎఫ్‌వైలో మొత్తం 2.03 లక్షల గృహాలు విక్రయం కాగా ఇందులో టాప్ 8 లిస్టెడ్ కంపెనీల విక్రయాల వాటా 6 శాతంగా ఉంది. నాన్–లిస్టెడ్ సంస్థల విక్రయాలు 11 శాతం, ఇతరు ల వాటా 83 శాతంగా ఉంది. 2021 ఎఫ్వైలోని లిస్టెడ్ కంపెనీల సేల్స్‌లో అత్యధికంగా 66.4 లక్షల చ.అ. విక్రయాలతో గోద్రెజ్ ప్రాపర్టీస్ ముందు వ రుసలో నిలువగా.. 50.4 లక్షల చ.అ. విక్రయాలలో బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ నిలిచింది. క్యూ3లో సేల్స్ అధరహో.. 2021 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 8 లిస్టెడ్ కంపెనీలు 2.123 కోట్ల చ.అ.లో విక్రయాలను పూర్తి చేశాయి. కోవిడ్–19 ఫస్ట్ వేవ్ 2020 ఎఫ్వైతో పోల్చితే విక్రయాలలో 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 2.088 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. ఎఫ్వై 21లో తొలి మూడు త్రైమాసికాల విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో సేల్స్ బాగా జరిగాయి. జూలై–సెప్టెంబర్ (క్యూ2)తో పోలిస్తే క్యూ3 విక్రయాలలో 77 శాతం వృద్ధి నమోదయింది. 8 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్ (క్యూ1)లో 51.6 లక్షల చ.అ. విక్రయాలను పూర్తి చేయగా.. క్యూ2లో 58 లక్షల చ.అ., క్యూ3లో 1.027 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. జనవరి–మార్చి (క్యూ4)లో ఇప్పటివరకు బ్రిగేడ్, ఒబెరాయ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్ మూడు కంపెనీలు మాత్రమే ఫలితాలను ప్రకటించాయి. ఇవి 32.1 లక్షల చ.అ.లుగా ఉన్నాయి. లిస్టెడ్, ప్రధాన కంపెనీలివే... ► 8 లిస్టెడ్ కంపెనీలివే: బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కోల్టే–పాటిల్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఒబెరాయ్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పూర్వాంకర, శోభా. ► ప్రధాన కంపెనీలివే: మైహోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, అసెట్జ్ ప్రాపర్టీ, ఏటీఎస్ గ్రీన్, కాసాగ్రాండ్ బిల్డర్స్, కల్పతరు, లోధా గ్రూప్, పిరామల్ రియల్టీ, రన్వాల్ గ్రూప్, సలార్పూరియా సత్త్వా, శ్రీరామ్ ప్రాపర్టీస్, సిగ్నేచర్ గ్లోబల్, సన్‌టెక్ రియల్టీ, టాటా హౌసింగ్ డెవలపర్మెంట్ కో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, వాధ్వా గ్రూప్, వీటీపీ రియల్టీ. -
గృహ కల్పనే...
రెండున్నరేళ్లకు ఇళ్ల మంజూరు నియోజకవర్గంలో 2500పైగా దరఖాస్తులు వస్తే 900 మంజూరు తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు బోట్‌క్లబ్ (కాకినాడ) : ఇవిగో ఇళ్లు...అవిగో ఇళ్లంటూ రెండున్నరేళ్లుగా ఊరించిన తెలుగుదేశం ప్రభుత్వం చివరకు ఉసూరుమనిపించింది. నిరీక్షణ తరువాత మంజూరు చేసిన ఇళ్లను చూసుకుని సంతోషించాలో, అరకొర కేటాయింపులతో దిక్కులు చూడాలో అర్థంకాని పరిస్థితుల్లో లబ్థిదారులున్నారు. రెండున్నరేళ్లకు నియోజకవర్గానికి 1250 ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటనతో ఇటు లబ్థిదారు లు, మరోవైపు తెలుగు తమ్ముళ్లు గంపెడాశతో ఎదురు చూశారు. తీరా కేటాయింపులు మొదలయ్యేసరికి నియోజకవర్గానికి 350 వంతున కోత పెట్టారు. అంటే నియోజకవర్గానికి 1250కి బదులు 900 ఇళ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థి తి. తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మిన ఎమ్మెల్యేలు, వారి అనుచరు లు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని గొప్పలకు పోవడంతో ప్రతి నియోజకవర్గం నుంచి 2500 నుంచి 3000లు దరఖాస్తు లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా మ రింత మంది ఇళ్ల కోసం దరఖాస్తులతో క్యూలో ఉన్నారు. ఉన్నవాటికే గృహ ‘కల్పనే’... దిక్కులేదు కొత్త దరఖాస్తులు తీసుకోలేమని తెలుగు తమ్ముళ్లు చేతులెత్తేసున్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల లెక్కలు తీస్తే ప్రస్తుతం మంజూరు చేసిన ఇళ్లు సగం కూడా లేకపోవడంతో ఎలా కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో జరిగే పార్టీ, అధికారిక కార్యక్రమాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. ఎలా పంపకం చేసుకుంటారో మీ ఇష్టమని స్థానిక నాయకులపై ఎమ్మెల్యేలు భారంమోపేసి చేతులెత్తేసే పనిలో ఉన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే ఐదుగురున్నారు. వారు కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు తమ బంధువులంటే, తమ బంధువులకే కేటాయింపులు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అందరికంటే ముందుగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని సామర్లకోట మండల స్థాయి నాయకులు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. గ్రామానికి పాతికి కూడా రావాయే. ప్రతి రూరల్ నియోజకవర్గంలో రెండు నుంచి నాలుగు మండలాలున్నాయి. మండలానికి 20కు పైనే గ్రామాలున్నాయి. గ్రామానికి పట్టుమని పాతిక ఇళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఫలితంగా అరకొర ఇళ్లను ఎలా సిఫార్సు చేయాలో అర్థం కాక టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.ప్రస్తుతం నియోజకవర్గాలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్థలాల్లో జియోట్యాగింగ్ చేసే పనిలో గృహ నిర్మాణశాఖ అధికారులు బిజీగా ఉన్నారు. మంజూరైనా తప్పని అవస్థలు... ఇప్పటి వరకూ ఇళ్లు మంజూరు కాలేదని, వచ్చిన వెంటనే మన వారందరికీ ఇళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పిన నాయకులకు ప్రస్తుతం ఇబ్బందులు తప్పడం లేదు. జాబితా తయారుచేసిన స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి నాయకులే తరచూ మార్పులు చేస్తున్నారు. తమ వారు పేర్లు లేకుండా జాబితా తయారుచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోందని, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలు వద్ద మొరపెట్టుకుంటున్నారు.