local body elections 2014
-
మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్సిపి కైవశం
ఖమ్మం : మధిర మండల ప్రజాపరిషత్(ఎంపిపి) అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి వేమిరెడ్డి వెంకట్రావమ్మ గెలుపొందారు. ఉపాధ్యక్షురాలుగా సీపీఎం అభ్యర్థి రావూరి శివనాగకుమారి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలోని 39 మండలాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని మండలాలలో ఉత్కంఠ నెలకొంది. -
వైఎస్సార్సీపీకే జెడ్పీ పీఠం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పట్టణాల్లో వైఎస్సార్ సీపీకి ఆధిక్యత ఇచ్చిన జిల్లా ప్రజలు పల్లెల్లోనూ జై జగన్ నినాదం చేశారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన 24 మ్యాజిక్ ఫిగర్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 26 మండలాల్లో వైఎస్సార్సీపీ పూర్తి మెజారిటీ సాధించింది. వైఎస్సార్సీపీ నుంచి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీచేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి 2395 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సూళ్లూరుపేట నుంచి బరిలోకి దిగిన వేనాటి రామచంద్రారెడ్డి 2205 ఓట్లతో గెలుపొందారు. ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్ష ఓటింగ్ జరిగి మండలాలు, జెడ్పీటీసీలను స్వీప్ చేసింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 10 ఎంపీటీసీలకు 10 స్థానాలు గెలిచి వైఎస్సార్సీపీ స్వీప్ చేసింది. కావలి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సు ల్లో చెదలు చేరడంతో ఏర్పడిన వివాదం కారణంగా ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. మిగిలిన కేంద్రాల్లో కూడా ఉదయం 8 గంటల నుంచే బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకుని వచ్చినా పార్టీల వారీగా బ్యాలెట్లు వేరు చేసి కట్టలు కట్టడంలో తీవ్ర ఆలస్యం జరిగి ఉదయం 11 గంటలకు కానీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క మండలం కానీ, ఒక్క జెడ్పీటీసీ స్థానం కానీ గెలవలేకపోవడం గమనార్హం. చైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాల్లో 24 మ్యాజిక్ ఫిగర్ గెలుచుకుని వేనాటి రామచంద్రారెడ్డిని జెడ్పీ చైర్మన్ చేయడానికి టీడీపీ రంగంలోకి దించింది. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు ఖర్చుచేసి ఎక్కడి కక్కడ వైఎస్సార్సీపీని కట్టడి చేయడానికి తీవ్రంగా కష్టపడింది. అయితే ఆ పార్టీని పల్లె జనం ఆదరించలేదు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దించింది. ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ పదవి మీద ఆశలు వదులుకుంది. అయితే దింపుడు కల్లం ఆశతో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. జెడ్పీటీసీ ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతూనే జెడ్పీ ఇక తమది కాదని టీడీపీ నిర్ణయించుకుంది. వైఎస్సార్సీపీ గెలిచిన జెడ్పీటీసీలు 1. బాలాయపల్లి 2.చిల్లకూరు 3. ఆత్మకూరు 4. సంగం 5. మనుబోలు 6. డి.వి.సత్రం 7. సీతారాంపురం 8. మర్రిపాడు 9. వాకాడు 10.పెళ్లకూరు 11. ఏఎస్ పేట 12. చిట్టమూరు 13 ఉదయగిరి 14. వెంకటాచలం 15. కోట 16. చేజర్ల 17. టీపీ గూడూరు 18 అనంతసాగరం 19 చిట్టమూరు, 20. కావలి రూరల్, 21 ముత్తుకూరు, 22 వింజమూరు టీడీపీ గెలిచిన జెడ్పీటీసీలు 1. వరికుంటపాడు 2. వెంకటగిరి 3.సూళ్లూరుపేట 4.దుత్తలూరు 5.డక్కిలి 6.నెల్లూరు రూరల్ 7.నాయుడుపేట 8. ఓజిలి 9.తడ 10.విడవలూరు వైఎస్సార్సీపీ గెలిచిన మండలాలు 1. నెల్లూరు రూరల్ 2. ఆత్మకూరు 3. సంగం 4. బాలాయపల్లి 5. మర్రిపాడు 6. వాకాడు 7. వింజమూరు 8. సీతారాంపురం 9. ఉదయగిరి 10. అల్లూరు 11. కొడవలూరు 12. ముత్తుకూరు 13. వెంకటాచలం 14. టీపీ గూడూరు 15.మనుబోలు 16. పెళ్లకూరు 17. కలువాయి 18. కోట 19. గూడూరు రూరల్ 20. డివిసత్రం 21. సూళ్లూరుపేట 22. జలదంకి 23.తడ 24. అనంతసాగరం 25. సైదాపురం, 26 బోగోలు టీడీపీకి దక్కిన మండలాలు 1. వరికుంటపాడు 2. డక్కిలి 3. నాయుడుపేట 4.చిట్టమూరు 5.కొండాపురం 6. విడవలూరు 7. చిట్టమూరు 8. కోవూరు 9. దుత్తలూరు 10. కలిగిరి 11. ఓజిలి 12. ఏఎస్ పేట 13. కావలి రూరల్ వెంకటగిరిలో చెరో 4 వెంకటగిరి మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లో 4 వైఎస్సార్సీపీ 4 టీడీపీ గెలిచింది. దీంతో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేకి మండల పరిషత్‌లో ఓటు హక్కు కల్పిస్తే ఈ ఫలితం ఎటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. చిల్లకూరు, బుచ్చి వైఎస్సార్సీపీవైపే చిల్లకూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 6 గెలుచుకుంది. టీడీపీ 5 దక్కించుకోగా కాంగ్రెస్ 2, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. అయితే ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రానుండటంతో ఈ మండలం కూడా వైఎస్సార్ సీపీ ఖాతాలో పడనుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 22 ఎంపీసీటీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 11, టీడీపీ 8 సీపీఎం 2 బీజేపీ 1 స్థానం గెలుపొందాయి. ఇక్కడ సీపీఎం లే దా బీజేపీ అభ్యర్థి ఒకరు వైఎస్సార్సీపీ వైపు నడిస్తే ఆ పార్టీ ఈ మండలాన్ని కూడా దక్కించుకుంటుంది. -
పల్లె ముంగిట..ఫ్యాన్ పంట
అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం విశ్వసనీయతకు ఓటరు పట్టం కట్టాడు. నిజాయతీతో కూడిన రాజకీయాలనే ఆదరించాడు. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటామని చాటుకున్నాడు. ఆపద సమయంలో అండగా నేనున్నానని భరోసానిస్తూ.. సంతోషంలో కుటుంబ సభ్యునిగా పాల్పంచుకుంటూ.. కష్టమొస్తే తన బాధగా భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బాసటగా నిలిచారు. పార్టీ అభ్యర్థులను పట్టణ వాసులు మున్సిపాలిటీల్లో గెలిపించగా.. పల్లెల్లో గ్రామీణులు ప్రాదేశిక అభ్యర్థులకు పెద్దపీట వేశారు. నాలుగేళ్ల క్రితం పురుడు పోసుకున్న వైఎస్ఆర్సీపీ ధాటికి వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ మట్టి కరువగా.. ద్వంద్వ నీతి కలిగిన 30 ఏళ్ల టీడీపీ కుదేలైంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయాలు నమోదు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ.. ప్రాదేశిక పోరులోనూ పట్టు సాధించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ముందు వెలువడిన ఈ ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కలిగింది. జిల్లాలో మొత్తం 815 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 785 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 378 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇదివరకే ఏకగ్రీవమైన 19 స్థానాలను కలుపుకుంటే 397 ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరినట్లయింది. ఈ లెక్కన 22 మండల పరిషత్‌లో పార్టీ అభ్యర్థులు పాగా వేశారు. టీడీపీ విషయానికొస్తే.. 334 ఎంపీటీసీ స్థానాలతో 19 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. మరో 11 మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. టీడీపీ విజయం సాధించిన స్థానాల్లో చాలా చోట్ల అత్యల్ప మెజార్టీతో గట్టెక్కడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ 43 స్థానాలకే పరిమితమైంది. ఈ పార్టీ అభ్యర్థులు సైతం అత్తెసరు మెజార్టీతోనే బయటపడగలిగారు. రాయలసీమ పరిరక్షణ సమితి పగిడ్యాల మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. 33 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. జెడ్పీటీసీల్లోనూ వైఎస్సార్సీపీదే హవా జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయంఢంకా మోగిస్తున్నారు. 53 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపులో మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు 24 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 13 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో రెండు, మూడు మినహా తక్కిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. కాంగ్రెస్ కనుమరుగే... జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రెండంకెలకే పరిమితమైంది. 43 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ ఖాతా తెరిచింది. జెడ్పీటీసీ స్థానాల్లో పూర్తిగా చతికిలపడింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రాభవం కోల్పోయినట్లయింది. కోట్ల ప్రాతినిధ్యం వహించిన కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడా ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోటీ చేసిన ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలంలోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేకపోవడం చర్చనీయాంశమవుతోంది. -
వేసేయ్ గాలం
సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీ, స్థానిక, సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ వేడి రగిల్చిన నాయకులు తాజాగా అధికార పీఠాలను కైవసం చేసుకునే ఎత్తుగడలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు కైవసం చేసుకునే పనుల్లో పడ్డారు. ప్రధానంగా జెడ్పీ చైర్పర్సన్ స్థానంపై అన్ని పార్టీల నాయకులు గురిపెట్టారు. ఫలితాల వెల్లడికి దాదాపు వారం గడువు ఉన్నప్పటికీ, చైర్పర్సన్ ఎన్నికకు నిర్దిష్ట సమయం ప్రకటించనప్పటికీ ‘తమదైన ఏర్పాట్లలో’ నాయకులు బిజీ అయ్యారు. జిల్లాలోని ఆయా మండలాల్లో జెడ్పీటీసీ స్థానం కోసం బరిలో నిలిచిన వారి సమాచారాన్ని సేకరించే పనిలో నాయకులు పడ్డారు. వారి ఫోన్ నంబర్లు, ఒకవేళ వారు గెలిస్తే ఎవరి మాట వింటారు, వారు మద్దతిచ్చిన పార్టీకే ఓటు వేస్తారా లేదా ప్రలోభ పెడితే తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో తమ ద్వితీయ శ్రేణి కార ్యకర్తల నుంచి ప్రధాన పార్టీల నాయకులు సమాచారం సేకరిస్తున్నారు. ‘ప్రత్యేక’ జాగ్రత్తలు జిల్లాలో గతంలో మెజార్టీ స్థానాలు గల పార్టీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఉదంతాన్ని ఆయా పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. మరోమారు అదే పరిస్థితి తలెత్తకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న తమకు ఈసారి పెద్ద ఎత్తున జెడ్పీటీసీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వారు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పార్టీ నుంచి బరిలో నిలిచిన వారి వివరాలను అందుబాటులో ఉంచుకొని తరచుగా వారితో టచ్‌లో ఉంటున్నారు. గతంలో జెడ్పీ పీఠాన్ని దాదాపు మెజార్టీ ఎన్నికల్లో దక్కించుకున్న టీడీపీలో మాత్రం ఈ పరిస్థితులే కనిపించకపోవడం లేదు. క్యాంప్ నడపుదామా..? వద్దా? మరోవైపు ‘క్యాంప్‌ల నిర్వహణ’ విషయంలో రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుస్తామనే ధీమాలో ఉన్న పార్టీతోపాటు.. అధిక స్థానాలు దక్కించుకుంటామనే పార్టీలు ఈ ప్రక్రియను సమీక్షించుకుంటున్నాయి. ఫలితాల నిర్వహణకు ఇంకా వారం రోజుల గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నిక నిర్వహణకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టనుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో స్పష్టత లేదు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉందా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడాన్ని బట్టి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జూన్ రెండో వారంలోనా లేదా స్థానిక ఫలితాల తర్వాతనా అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే క్యాంపులు నిర్వహిస్తే అది తలకు మించిన భారంగా మారుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు, భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుందనే ఉద్దేశంతో ఈ ఆలోచన విరమించుకున్నట్లు జిల్లా నాయకుడొకరు తెలిపారు. కానీ, మరోవైపు బరిలో నిలిచి, గెలిచిన వారికి ఎక్కడ ప్రత్యర్థి పార్టీలు తమ గూటికి లాక్కుంటాయోనన్న బెంగ పీడస్తోంది. జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ బాధ్యులు కొందరిని వ్యక్తిగతంగా కలుస్తూ రోజు టచ్‌లో ఉంటున్నారు. యనకే జెడ్పీ పీఠం దక్కుతుందని, ప్రలోభాలకు లొంగవద్దని భరోసా ఇస్తున్నారు. ఫలితాల వెల్లడికి ముందే ఇంతటి ఉత్కంఠను రేకెత్తిస్తున్న రాజకీయ ఫలితాల అనంతరం ఏ విధంగా ఉంటాయోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైఎస్ హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు
నేరేడుచర్ల, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నేరేడుచర్ల, కందులవారిగూడెం, బొత్తలపాలెం, అలింగాపురం, జాన్‌పహాడ్‌లో పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అర్హులైన వారిందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల రుణాల మాఫీ, పావలా వడ్డీరుణాలు, విద్యుత్ బకాయిల మాఫీ జరిగాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా స్థానిక మంత్రి జోక్యం చేసుకోకపోవడం దారుణమన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట బ్రోకర్లకు, కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చరన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేకాట క్లబ్‌లను మూసి వేయిస్తామన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహాల, వైఎస్సార్ కాంగ్రెస్ జోలికి వస్తే రాజకీయంగా అంతం కావడం ఖాయమన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇనుపాల పిచ్చిరెడ్డి, కుందూరు మట్టారెడ్డి, గజ్జల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి బాణోతు మంగమ్మ, ఎంపీటీసీ అభ్యర్థులు బండావత్ సరిత, నకిరేకంటి సైదులు, బాణవత్ బుజ్జి, బెరైడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బెల్లంకొండ గోవింద్‌గౌడ్, రాజేష్, యాకుబ్, కొదమగుండ్ల మట్టయ్య, సుం కరి యాదగిరి, థామస్, పఠాన్ జాని, పల్లా అంజయ్య, కీత శ్రీను, బాలసైదా, ఉపేంద్రచారి, రాపోలు వెంకన్న, దుర్గా ఉన్నారు. -
కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి
చేవెళ్ల, న్యూస్‌లైన్ : త్వరలో జరుగనున్న ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. చేవెళ్లలోని రెండు ఎంపీటీసీ స్థానాలలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న కె.పోచమ్మ, టేకులపల్లి శివరంజనిశ్రీను, జెడ్పీటీసీ అభ్యర్థి సుచితలను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ దేశం సుస్థిరంగా ఉండాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు. డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్ చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.బాల్‌రాజ్, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు జి.రవికాంత్‌రెడ్డి, ఎం.యాదగిరి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, శివానందం, డి.శ్రీధర్‌రెడ్డి, జి.సత్తిరెడ్డి, ఎం.వెంకటేశ్, టేకులపల్లి శ్రీను, కొజ్జెంకి శ్రీను, కె.బుచ్చిరెడ్డి, మాధవరెడ్డి, బి.విఠలయ్య తదితరులున్నారు.