LOCKED HOUSES
-
పగలంతా చిత్తు కాగితాలు ఏరుకుంటారు.. మధ్యలో వృత్తి మార్చి
సాక్షి అల్వాల్: చిత్తు కాగితాలు ఏరుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుండి రూ. 10 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సీఐ గంగాధర్ తెలిపిన మేరకు.. హస్మత్‌పేట్ అంజయ్యనగర్‌లో నివాసముండే సంతోష్‌కుమార్ ఇంట్లో ఈ నెల 14న చోరీ జరిగింది. రూ.18.50 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బుధవారం హస్మంత్‌పేట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది. చదవండి: దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు గుల్బర్గకు చెందిన జ్యోతి(30), రూప (36)లు తుకారగేట్‌లోని మంగర్ బస్తీలో నివాసముంటున్నారు. ఉదయం పూట చిత్తుపేపర్లు ఏరుకోవడం, వెంట్రుకలకు స్టీల్ సామగ్రి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. మధ్యలో దొంగతనానికి పాల్పడుతున్నారు. హస్మత్‌పేట్‌లో దొంగతనానికి పాల్పడిన డబ్బులో కొంత జల్సాలకు ఉపయోగించారు. వారి నుంచి 10 లక్షల 7 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం!
సాక్షి, తిరువూరు : తాళంవేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని ఒక నివాసంలో చోరీ జరిగింది. అటవీశాఖలో పనిచేస్తున్న పెరికె మోహినీ విజయలక్ష్మి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చా రు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో తమ నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ.3 లక్షల నగదు, 300 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విలువైన దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి. క్లూస్ టీం దర్యాప్తు మచిలీపట్నం క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ ప్రాథమిక సమాచారం సేకరించిన అనంతరం తిరువూరు సర్కిల్లోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా అగంతకులు చోరీలకు పాల్పడుతున్నందున ముందస్తు బందోబస్తు కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, గుర్తుతెలియని వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసుస్టేషనుకు సమాచారం అందించాలని స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
ఇది ఉందంటే దొంగతనాలు జరగవు!
ఈ మధ్య ఊరెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు ప్రజలు. దొంగల బెడద అలా ఉంది మరి.. కానీ నిశ్చింతగా ఊరెళ్లండంటూ పోలీసులు అభయమిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో దొంగతనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. సాక్షి, అద్దంకి రూరల్ : తాళం వేసి ఉన్న ఇంటిలో జరిగే దొంగతనాలు చేసే దొంగలకు ఎల్‌హెచ్‌ఎంఎస్( లాక్హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా చెక్ పెట్టవచ్చని సీఐ హైమారావు అన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని నిరోధించటానికి ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎవరైనా ఒకటి రెండు రోజుల ఊరువిడిచి వెళ్లాల్సి వచ్చినా పోలీస్ వారికి తెలియచేస్తే ఆ ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా ఇంటిలో ఒక మూలన రహస్య కెమెరాను అమర్చుతారన్నారు. ఆ కెమెరా ఇంటిలోకి దొంగ ప్రవేశించగానే ఆటోమాటిక్‌గా పనిచేయటం ప్రారంభించి సంబంధిత పోలీస్ స్టేషన్లో అలారం మోగుతుందని వివరించారు. దీంతో ఇంటిలోకి దొంగ ప్రవేశించిన 5 నిమిషాల లోపే పట్టుకునే అవకాశం ఉటుందన్నారు. ఈ సిస్టమ్‌ను ప్రజలు వినియోగించుకుని దొంగతనాల బారి నుంచి తప్పించుకొవచ్చన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి ఈ పద్ధతి అనుసరించాలని కోరారు. పెరిగిన గస్తీ... పట్టణంలో దొంగతనాలను అరికట్టటానికి గస్తీని పెంచుతున్నట్లు సీఐ తెలిపారు. పట్టణాన్ని 8 బీట్ ప్రాంతాలుగా విభజించి గస్తీలను ముమ్మరం చేస్తామన్నారు. ఇంటిలోపల లైట్లు వెలిగి ఉండి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, యజమానుల పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణంలో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి బాగు చేయిస్తామని చెప్పారు. ఇటీవలే చోటుచేసుకున్న దొంగతనాలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సై సుబ్బరాజు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు క్రైం అడిషనల్ డీసీపీ బి.అశోక్‌కుమార్ తెలిపారు. కొత్తగూడెం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కేతిరి రాము అలియాస్ కేదారి పార్థు.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనలకు పాల్పడుతున్నాడని ఆయన తెలిపారు. నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. రాము ములకలపల్లి పరిసర గ్రామాల్లో చిక్కు వెంట్రుకలను అమ్ముకోవడం, కొనడం చేసేవాడు. 2007లో నిందితుడి తండ్రి మరణించడంతో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో తన స్నేహితులతో కలిసి తొలిగిసారిగా విజయవాడ కృష్ణలంక, ఖమ్మం, ఇల్లందు, మహబుబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ తీగను దొంగిలించాడు. 2008లో జైలుకు.. రాము తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ విజయవాడ, ఖమ్మం పోలీసుకుల చిక్కి 2008లో తొలిసారి జైలుకు వెళ్లాడు. విజయవాడ, మహబుబ్‌నగర్ జిల్లా పోలీసులు పలుమార్లు జైలుకు పంపారు. నిందితుడు రాము తిరిగి 2013 నుంచి 2017 వరకు చిక్కు వెంట్రుకల వ్యాపారం చేసి.. ఆ తర్వాత క్రమంగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2017 డిసెంబర్ నుంచి భూపాలపల్లి జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, వరంగల్ మామునూరు పీఎస్ పరిధిలో రెండు, పర్వతగిరిలో 2, కాజిపేట, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో 2 చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొమ్మును విక్రయించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు సిద్ధమయ్యాడు. కాగా బులియన్ మార్కెట్లో రాము అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కైం ఏసీపీ బాబురావుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డెవిడ్‌రాజ్ తన సిబ్బందితో వెళ్లి రామును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన 512 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సీపీ అభినందనలు.. నిందితుడిని సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన పోలీసులను సీపీ జి.సుధీర్‌బాబు అభినందించారు. అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు, ఇన్స్పెక్టర్ డెవిడ్‌రాజ్, ఎస్సై బీవీ.సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఏఎస్సై వీరస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు శివకుమార్, సుధీర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, వంశీని సీపీ అభినందించారు. -
దొరికినంతా దోచేశారు
తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. చాకచక్యంగా తాళాలు పగులగొట్టి బీరువాల్లోని నగదు, నగలు, వెండి సామగ్రి అపహరించారు. జిల్లాలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆరు చోరీలు జరిగాయి. వీరవాసరం మండలం రాయకుదురు శివారులోని మూడు ఇళ్లలో, కొయ్యలగూడెం, ఇరగవరం మండలం కత్తవపాడు, భీమవరంలో ఒక్కో ఇంట్లో చోరీలు జరిగాయి. వీరవాసరం : తాళాలు వేసి ఉన్న మూడు ఇళ్లలో సోమవారం దొంగలు చోరీలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు జగన్నాథపేటకు చెందిన కడలి గోవిందరావు, కడలి హరికృష్ణ, రాయకుదురు గ్రామానికి చెందిన మద్దాల లక్షీ్మనారాయణ ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు లోనికి చొరబడ్డారు. కడలి గోవిందరావు, హరికృష్ణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. వీరు ఇళ్లకు తాళాలు వేసి పొరుగూరుకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కడలి గోవిందరావు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు రూ.5 వేల నగదు, 15 తులాల వెండి వస్తువులు, కాసు బంగారు నగలు చోరీ చేశారు. కడలి హరికృష్ణ ఇంట్లో విలువైన సామగ్రిని ఎత్తుకుపోయారు. మద్దాల లక్షీ్మనారాయణ ఇంట్లో ఎవరూ నివాసముండటం లేని కారణంగా ఏ వస్తువులు లేవు. క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. వస్తువులపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. క్లూస్ టీం ఎస్సై ఎం.రాజేష్, ఏఎస్సై బి.రాధాకృష్ణ, కానిస్టేబుల్ ఎన్. వెంకట్రావు ఘటనా స్థలాలను పరిశీలించారు. కొయ్యలగూడెం కాలేజ్ రోడ్డులో.. కొయ్యలగూడెం : కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీస్స్టేన్కి సమీపంలో మాతంశెట్టి వీరభధ్రం అనే ఫ్యాన్సీ దుకాణ యజమాని కుటుంబంతో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం వివాహ వేడుకకు కుటుంబంతో సహా ఖమ్మం జిల్లా దమ్మపేట వెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చొరబడ్డారు. సోమవారం ఉద యం ఇంటికి తిరిగి వచ్చిన వీరభద్రం కుటుం బసభ్యులు తాళాలు పగులకొట్టి ఉండటంతో కంగారుగా లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగి నట్టు గుర్తించారు. బీరువాలోని మూడున్నర కాసుల బంగారు నగలు చోరీకి గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు. కత్తవపాడులో వేకువజామున.. ఇరగవరం: తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడిన సంఘటన ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కత్తవపాడు గ్రామానికి చెందిన శివాలయం పూజారి యలవలపల్లి లక్షీ్మనర్సింహమూర్తి భార్య రమాదేవితో కలిసి గ్రామ శివారులో నివాసముంటున్నారు. సోమవారం వేకువజామున 3 గంటలకు ఇంటికి తాళం వేసి ఆలమూరు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా తాళాలు పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు బీరువాలోని రూ.30 వేల నగదు, ఆరు కాసుల బంగారు ఆభరణం, నల్లపూసలతాడు, చెవి దుద్దులు, నాలుగు తులాల వెండి సామగ్రి అపహరించారు. అప్పు తీర్చేందుకు రూ.30 వేలు తీసుకువచ్చి బీరువాలో పెట్టానని లక్షీ్మనర్సింహమూర్తి విలపించారు. ఎస్ఐ కేవీవీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరంలో ఆభరణాలు భీమవరం టౌన్: తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ చేశారని మహ్మద్ ఇ మ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు సోమవారం తెలిపారు. ఈ నెల 5న ఇంటికి తాళం వేసి తిరిగి వచ్చి చూసే సరికి చోరీ జరిగిందని ఇమ్రాన్ పోలీసుల ను ఆశ్రయించారన్నారు.