దొరికినంతా దోచేశారు
దొరికినంతా దోచేశారు
Published Mon, Mar 6 2017 11:55 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. చాకచక్యంగా తాళాలు పగులగొట్టి బీరువాల్లోని నగదు, నగలు, వెండి సామగ్రి అపహరించారు. జిల్లాలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆరు చోరీలు జరిగాయి. వీరవాసరం మండలం రాయకుదురు శివారులోని మూడు ఇళ్లలో, కొయ్యలగూడెం, ఇరగవరం మండలం కత్తవపాడు, భీమవరంలో ఒక్కో ఇంట్లో చోరీలు జరిగాయి.
వీరవాసరం : తాళాలు వేసి ఉన్న మూడు ఇళ్లలో సోమవారం దొంగలు చోరీలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు జగన్నాథపేటకు చెందిన కడలి గోవిందరావు, కడలి హరికృష్ణ, రాయకుదురు గ్రామానికి చెందిన మద్దాల లక్షీ్మనారాయణ ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు లోనికి చొరబడ్డారు. కడలి గోవిందరావు, హరికృష్ణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. వీరు ఇళ్లకు తాళాలు వేసి పొరుగూరుకు వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కడలి గోవిందరావు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు రూ.5 వేల నగదు, 15 తులాల వెండి వస్తువులు, కాసు బంగారు నగలు చోరీ చేశారు. కడలి హరికృష్ణ ఇంట్లో విలువైన సామగ్రిని ఎత్తుకుపోయారు. మద్దాల లక్షీ్మనారాయణ ఇంట్లో ఎవరూ నివాసముండటం లేని కారణంగా ఏ వస్తువులు లేవు. క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. వస్తువులపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. క్లూస్ టీం ఎస్సై ఎం.రాజేష్, ఏఎస్సై బి.రాధాకృష్ణ, కానిస్టేబుల్ ఎన్. వెంకట్రావు ఘటనా స్థలాలను పరిశీలించారు.
కొయ్యలగూడెం కాలేజ్ రోడ్డులో..
కొయ్యలగూడెం : కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీస్‌స్టేన్‌కి సమీపంలో మాతంశెట్టి వీరభధ్రం అనే ఫ్యాన్సీ దుకాణ యజమాని కుటుంబంతో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం వివాహ వేడుకకు కుటుంబంతో సహా ఖమ్మం జిల్లా దమ్మపేట వెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చొరబడ్డారు. సోమవారం ఉద యం ఇంటికి తిరిగి వచ్చిన వీరభద్రం కుటుం బసభ్యులు తాళాలు పగులకొట్టి ఉండటంతో కంగారుగా లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగి నట్టు గుర్తించారు. బీరువాలోని మూడున్నర కాసుల బంగారు నగలు చోరీకి గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు.
కత్తవపాడులో వేకువజామున..
ఇరగవరం: తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడిన సంఘటన ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కత్తవపాడు గ్రామానికి చెందిన శివాలయం పూజారి యలవలపల్లి లక్షీ్మనర్సింహమూర్తి భార్య రమాదేవితో కలిసి గ్రామ శివారులో నివాసముంటున్నారు. సోమవారం వేకువజామున 3 గంటలకు ఇంటికి తాళం వేసి ఆలమూరు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా తాళాలు పగులగొట్టి లోనికి చొరబడిన దొంగలు బీరువాలోని రూ.30 వేల నగదు, ఆరు కాసుల బంగారు ఆభరణం, నల్లపూసలతాడు, చెవి దుద్దులు, నాలుగు తులాల వెండి సామగ్రి అపహరించారు. అప్పు తీర్చేందుకు రూ.30 వేలు తీసుకువచ్చి బీరువాలో పెట్టానని లక్షీ్మనర్సింహమూర్తి విలపించారు. ఎస్‌ఐ కేవీవీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరంలో ఆభరణాలు
భీమవరం టౌన్: తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ చేశారని మహ్మద్ ఇ మ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు టూటౌన్ సీఐ ఎం.రమేష్‌బాబు సోమవారం తెలిపారు. ఈ నెల 5న ఇంటికి తాళం వేసి తిరిగి వచ్చి చూసే సరికి చోరీ జరిగిందని ఇమ్రాన్ పోలీసుల ను ఆశ్రయించారన్నారు.
Advertisement