లాడ్జిలో యువకుడి ఆత్మహత్య
సామర్లకోట (పెద్దాపురం నియోజకవర్గం) :
హైదరాబాద్‌లో తాపీ పనికి వెళ్లిన పెద్దాపురానికి చెందిన ఒక యువకుడు సామర్లకోట లాడ్జీలో శవమై కనపించాడు. పోలీసుల కథనం ప్రకారం పెద్దాపురం పాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పద్మనాభ కాలనీకి చెందిన నకిన గోవిందు (19) సామర్లకోట రైల్వేస్టేçÙ¯ŒS ఎదురుగా ఉన్న విజయ లాడ్జిలో ఫ్యానుకు టవల్‌తో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మూడు నెలల క్రితం స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లాడన్నారు. అయితే ఈ నెల 14న లాడ్జీలో విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ తీసుకున్నాడు. స్థానిక చిరునామా కోసం పెద్దాపురంలోని స్నేహితుడు యాదగరి సాయి గుర్తింపు కార్డుతో రూమ్ తీసుకున్నాడు. అదే రోజు సాయి వెళ్లిపోయినట్టు లాడ్జి గుమాస్తా పెదిరెడ్ల సత్యనారాయణ పోలీసులకు తెలిపారు. శని, ఆదివారాలు వరకూ వారిద్దరూ బయటకు వెళ్లారని లాడ్జి నిర్వాహకులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి గోవిందు బయటకు రాలేదు. సోమవారం ఉదయం బాయి తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు లాడ్జి నిర్వాహకులు సమాచారం అందజేశారు. లాడ్జీలో ఉన్న సమాచారం మేరకు సాయికి, గోవిందు తల్లిదండ్రులకు లాడ్జి గుమస్తా సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్సై లక్షీ్మకాంతం రూము తలుపులను పగలుకొట్టగా గోవింద్ ఫ్యాను టవల్ బిగించి ఉరి పోసుకున్నట్టు గమనించారు. రూములో డైనింగ్ టైబుల్‌పై మద్యం గ్లాసు, తినుబండారాలు ఉన్నాయి. రూములో టీవీ ఆ¯ŒSలో ఉంది. పండుగకు రావాలని కోరితే శవమై కనిపించాడని గోవిందు తల్లి దుర్గ బోరున రోదించింది. కుమారునకు ఎటువంటి అప్పులు లేవని, ఎవరూ శత్రువులు కూడా లేరని, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదని రోదిస్తూ తెలియజేసింది. తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్షీ్మకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.