గ్రహణ శక్తి, తార్కిక విశ్లేషణ పరీక్ష.. అడ్వాన్స్డ్
జేఈఈ-మెయిన్ చివరి దశకు చేరుకుంది. మెయిన్‌లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ప్రతిభ చూపిన లక్షా యాభై వేల మంది విద్యార్థులకు మాత్రమేప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం దక్కుతుంది.. మే 25న నిర్వహించే అడ్వాన్స్‌డ్‌కు ఐదు వారాలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో మెయిన్ నుంచి అడ్వాన్స్డ్ దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు..
మ్యాథమెటిక్స్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 40 రోజుల సమయాన్ని టాపిక్‌వైజ్ ప్రిపరేషన్, గ్రాండ్‌టెస్ట్ రాసే విధంగా విభజించుకోవాలి. ఇందులో మొదటి 20 రోజులు టాపిక్‌వైజ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. తర్వాతి సమయాన్ని గ్రాండ్‌టెస్ట్‌లు, మాక్‌టెస్ట్‌లు రాయడానికి వినియోగించుకోవాలి.
ముందుగా సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలు, ఫార్ములాలపై దృష్టి సారించాలి. తర్వాత ఒక స్థాయి (లెవల్-1) సమస్యలను సాధించే ప్రయత్నం చేయాలి. అటుపై అప్లికేషన్ ఓరియెంటెడ్ సమస్యలను సాధించడం ప్రయోజనకరం.సిలబస్ పరంగా కూడా కొద్ది తేడా ఉంటుంది. మెయిన్‌లో ఉండే స్టాటిస్టిక్స్ (మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్), మ్యాథమెటిక్ రీజనింగ్/లాజిక్, సెట్స్ అండ్ రిలేషన్స్ చాప్టర్లు అడ్వాన్స్‌డ్‌లో ఉండవు. లాగరిథమ్, వెక్టార్ ఆల్జీబ్రా, జియోమెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నెంబర్, జియోమెట్రికల్ ఇంటర్‌ప్రిటేషన్ చాప్టర్లు చాలా కీలకమైనవి.
ఎంసెట్‌లో ప్రశ్నలు నేరుగా (డెరైక్ట్‌గా) ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు మాత్రం మిక్స్డ్ కాన్సెప్ట్స్ ఆధారితం. అడ్వాన్స్‌డ్‌లో భావనల (ఇౌఛ్ఛిఞ్టట)పై ఆధారపడి ప్రశ్నలు ఉంటాయి. సూత్రాలపై కాదు. అయినప్పటికీ.. ఉమ్మడి సూత్రాల (ఇౌఝఝౌ జౌటఝఠ్చ)ను గుర్తు పెట్టుకోవాలి. కొన్ని ప్రధాన సూత్రాల నిర్మాణంలోని కొంత విషయాన్ని మార్చి (ఛీజీఠ్ఛిటటజ్టీడ) ఫలితాలను అడిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ ఫలితాల అనువర్తనాలను కూడా అడగొచ్చు.
సిలబస్‌లోని అంశాల మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని (ఇంటర్ రిలేషన్షిప్), వాటి ప్రాధాన్యతను అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకు కోఆర్డినేట్ జ్యామెట్రీపై అవగాహనకు, సాధనకు ఉపయోగపడే జ్ఞానం, తార్కికత.. కాంప్లెక్స్ నెంబర్ అంశంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రొబబిలిటీ సమస్యలను సాధించాలంటే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్‌పై పట్టు సాధించాలి. ట్రిగ్నోమెట్రీ సమస్యలను సాధించడానికి ఉపయోగపడే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతి.. దాదాపు అన్ని అంశాల్లోని సమస్యల సాధనకు ఉపయోగపడుతుంది.
పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రొబబిలిటీ చాప్టర్లు చాలా క్లిష్టమైనవి. ప్రాథమిక భావనలను అవగాహన చేసుకోవడం, ఎక్కువ ప్రశ్నలను సాధన చేయ డం ద్వారా ఈ అంశాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. ఫంక్షన్స్, డిఫరెన్షియబిలిటీ, వెక్టార్ అల్జీబ్రా, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్‌పై దృష్టి సారించాలి.
అదేవిధంగా ప్రతి టాపిక్కు సంబంధించిన థియరీ పార్ట్‌ను కూడా ప్రిపేర్ కావాలి. ఆయా అంశాలపై అవగాహనను షార్ట్-ఆన్సర్ కొశ్చన్స్, అసెర్షన్-రీజన్ వంటి ప్రశ్నల ద్వారా పరీక్షించుకోవాలి. సబ్జెక్ట్ టైప్ ప్రాబ్లమ్స్‌ను కూడా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ అంశం విషయావగాహనను మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తుంది.
సాధ్యమైనన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా వేగం, కచ్చితత్వం అలవడతాయి. ఈ సమయంలో ఏదైనా నూతన టాపిక్‌ను ప్రిపేర్ కావడం కంటే..ఇది వరకు చదివిన అంశాన్ని పునశ్చరణ చేసుకోవడం మేలు. సాధారణంగా వేగంగా చేయాలనే ఉద్దేశం, ఒత్తిడితో ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాధానాలను గుర్తించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. సిలబస్‌లోని 80 శాతం చాప్టర్లను పక్కాగా ప్రిపేరైతే మెరుగైన స్కోర్ సాధించవచ్చు.
రిఫరెన్స్ బుక్స్:
Tata mcgrawhillBooks;
Cengage Books.
-ఎంఎన్ రావు,
చైతన్య విద్యా సంస్థలు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఎస్బీ-ధన్‌బాద్ వంటి ప్రాముఖ్యత కలిగిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ-అడ్వాన్స్డ్. మారిన విధానంలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులకు ఈ పరీక్షకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో.. అడ్వాన్స్డ్ పరీక్ష ప్రతిభావంతులుగా సమరంగా మారింది. దాంతో సీటు దక్కించుకోవాలంటే రెట్టింపు శ్రమించాల్సిన పరిస్థితి.
రెండు పేపర్లుగా:
జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను రెండు పేపర్లు.. పేపర్-1, పేపర్-2గా ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్‌లైన్ (పేపర్-పెన్ బేస్డ్)లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. కాల వ్యవధి ప్రతి పేపర్‌కు మూడు గంటలు. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కు ఇస్తారు.
ఫిజిక్స్
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. మొదటి సంవత్సరం సిలబస్ నుంచి మెకానిక్స్‌కు, రెండో సంవత్సరం సిలబస్ నుంచి ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం చాప్టర్లకు ప్రాధాన్యత లభిస్తోంది.
వివిధ చాప్టర్లకు సంబంధించి కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు.
మల్టి కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలను సాధించాలంటే.. సర్ఫేస్ టెన్షన్, ఎలాస్టిసిటీ వంటి చిన్న అంశాలను సైతం వదలకుండా అన్ని చాప్టర్లకు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలపై పట్టు సాధించాలి.
ఫిజిక్స్‌లో సాధారణంగా వివిధ చాప్టర్లకు మధ్య సహసంబంధం ఉండే ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటారు.
ఈ నేపథ్యంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ తీసుకుని..దాన్ని వివిధ చాప్టర్లకు సరిపోయే విధంగా రూపొందించుకోవాలి. ఉదాహరణకు మెకానిక్స్ తీసుకుంటే ఇందులో చాలా సమస్యలు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మొమెంటమ్, న్యూటన్ రెండో సూత్రానికి సంబంధించినవై ఉంటాయి. అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్‌కు కూడా చాలా వరకు ఇతర చాప్టర్లతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అడ్వాన్స్డ్ సిలబస్‌తో పోల్చితే ఇంటర్మీడియెట్ సిలబస్‌లో ఆర్సీ, ఆర్ఎల్ సర్క్యూట్స్ టాపిక్స్ లేవు. కాబట్టి ఈ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి సారించాలి.
ఎలక్ట్రిసిటీ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్‌ను సాధించేటప్పుడు రెసిస్టర్ పాత్ర, కెపాసిటర్, ఇండక్టర్ (ఏసీ, డీసీ) వంటి అంశాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఆర్సీ, ఆర్ఎల్ సర్క్యూట్స్‌కు సంబంధించి కెపాసిటర్ ప్రాథమిక విధులు, వివిధ పరిస్థితుల్లో ఇండక్టర్ వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి.థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కామన్‌గా ఉంటాయి. ఆప్టిక్స్‌లో మొదట వేవ్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి. ఎందుకంటే దీని పరిధి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత జియోమెట్రికల్ ఆప్టిక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇతర సబ్జెక్ట్లతో పోల్చితే ప్రిపరేషన్ పరంగా, రివిజన్ పరంగా ఫిజిక్స్‌ను చాలా సులువైన సబ్జెక్ట్‌గా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్ల మధ్య సహ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్‌ను బాగా ప్రిపేర్ అయితే.. ఇందులోని కాన్సెప్ట్స్‌ను కొద్దిపాటి మార్పులతో గ్రావిటేషన్, మాగ్నటిజం చాప్టర్లకు కూడా అన్వయించుకోవచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వారానికి కనీసం 3 మాక్ టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకుని బలహీనంగా ఉన్న చాప్టర్లపై ఎక్కువగా దృష్టి సారించాలి. మరో కీలక విషయం.. ఈ సమయంలో కొత్త అంశాలు చదవడం కంటే ఇదివరకు ప్రిపేర్ అయిన వాటిని పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం.
రిఫరెన్స్ బుక్స్:
Concepts of Physics (Vol. I and II)
H.C.Varma.
Problems in General Physics
I.E. Irdov.
For practice questions:
Cengage Learning’s Exam Crack Series
-డాక్టర్ రామకృష్ణ,
ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్.
జనరల్ టిప్స్
విద్యార్థి గ్రహణ శక్తి, తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ సరిపోతుంది. ఆ ప్రిపరేషన్‌ను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో కొనసాగించాలి.
{పతి చాప్టర్లోని సూత్రాలను, ముఖ్యమైన అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. వాటిని కూడా పాయింటర్ అప్రోచ్‌లో రూపొందించుకోవాలి.
భావనల ఆధారంగా ప్రశ్నను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. టాపిక్ పూర్తయిన వెంటనే సంబంధిత టాపిక్‌పై రోజుకు కనీసం 50 నుంచి 100 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయ పరిమితి విధించుకోవాలి.
గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో ఒక చాప్టర్ నుంచి ఏ ప్రశ్నలు, ఏ విధంగా అడుగుతున్నారో పరిశీలించాలి.
{పస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వారానికి రెండు మోడల్ టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి.
జేఈఈ-అడ్వాన్స్డ్ సమాచారం:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 4, 2014
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 9, 2014
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 12, 2014
పరీక్ష తేదీ: మే 25, 2014 (ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా)
వివరాలకు: http://jeeadv.iitd.ac.in
కెమిస్ట్రీ
ఈ విభాగంలో 60 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసినా మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. ఎక్కువగా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు (more than one answer)ఉండే ప్రశ్నలు అడుగుతున్నా రు. దీని వల్ల విద్యార్థులు అన్ని ఆప్షన్స్ (option)చదివి సమాధానం రాయాల్సి వస్తోంది. అంతేకాకుండా రుణాత్మక (నెగిటివ్) మార్కులు ఉండటం వల్ల మార్కులు తగ్గి మంచి ర్యాంకు రాకపోవచ్చు.
కెమిస్ట్రీలో అకర్బన, కర్బన, భౌతిక రసాయ శాస్త్రాలు అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. వీటిల్లో అకర్బన రసాయన శాస్త్రం నుంచి సుమారుగా 30 శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ భాగం నుంచే అడిగే ప్రశ్నల స్థాయి కూడా పెరిగింది. కాబట్టి ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేస్తూ, అందులోని అంశాలకు సంబంధించిన పట్టికలు రూపొందించుకొని ప్రిపరేషన్ సాగించాలి. అకర్బన రసాయన శాస్త్రంలో ఞ-block, d-block, Complex compounds, Metallurgy (Practical Inorganic Chemistry) Qualitative Analysis అంశాలకు సంబంధించిన ప్రశ్నలు బాగా అభ్యసనం చేయాలి.
కర్బన రసాయన శాస్త్రం నుంచి సుమారుగా 35 శా తం ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో మార్కులు తెచ్చుకోవడం కూడా కొంచెం సులువే. Mechani-sm, Reagents Intermediates, Electron displacements applicationవంటి అంశాలపై బాగా దృష్టి సారించాలి. Named reactionsకు సంబంధించి Mechanism, Exceptional cases వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. Alkenes, Alcohol, Carbonyl compounds, Amines, Aromatic compoundsMýS సంబంధించి Sequence reactions బాగా నేర్చుకోవాలి.
భౌతిక రసాయన శాస్త్రం నుంచి 35 నుంచి 40 శాతం ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అంశాలతో పాటు, ఫార్ములాలు నేర్చుకోవడమే కాకుండా మల్టి కాన్సెఫ్ట్యూవల్ (కఠ్టజీ ఛిౌఛ్ఛిఞ్టఠ్చ)ప్రశ్నలను బాగా సాధన చేయాలి. పరమాణు నిర్మాణం, రసాయన బంధం, వాయుస్థితి అంశాల నుంచి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతున్నారు. Electro Chemistry, Thermody-namics, Equilibrium, Solutions, Stoichi-ometry అంశాల నుంచి మల్టి కాన్సెఫ్ట్యూవల్ (Mu-lti conceptual) ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలోని ఉంచుకుని సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. KineticsÌZ order, Half life period, 1st order Kinetics బాగా ప్రాక్టీస్ చేయాలి.
పిపరేషన్కు రోజుకు నాలుగు గంటలు కేటాయించాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేలా సన్నద్ధం కావాలి.
గత ప్రశ్నపత్రాలు, వాటిలోని ముఖ్యమైన అంశాలను ఒక దగ్గర రాసుకొని సాధన చేయాలి.
పరీక్షకు సుమారుగా 40 రోజులు వ్యవధి ఉంది. ఇందులో 10 రోజులు ఇనార్గానిక్ కెమిస్ట్రీ, 10 రోజులు ఫిజికల్ కెమిస్ట్రీ, 10 రోజులు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలి. మిగిలిన 10 రోజులు గత ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయాలి. సాధ్యమైనన్ని మాదిరి పరీక్షలు రాస్తూ, తప్పు-ఒప్పులను విశ్లేషణ చేస్తూ అధ్యయనం చేయాలి. పిపరేషన్లో ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవాలి. అంతేకానీ ఎక్కువ పుస్తకాలను ఒకసారి చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
రిఫరెన్స్ బుక్స్:
11, 12వ తరగతుల కెమిస్ట్రీ పుస్తకాలు
ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీ బుక్స్
-టి. కృష్ణ,
డాక్టర్ ఆర్కే క్లాసెస్, హైదరాబాద్.