అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: నాగపట్నం సమీపంలో ఎన్నికల కక్షల కారణంగా అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఆరుగురు కత్తిపోట్లకు గురయ్యారు. నాగపట్టణం, కొల్లిడం, పాలూరాన్ పడుగైకు చెందిన లండన్ అన్బళగన్ (50). పీఎంకే నాయకుడు ఇతను అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నాయకుడు దయాలన్ (50) మధ్య ఎన్నికలకు సంబంధించి పాత కక్షలు ఉన్నాయి. దయాలన్‌కు చెందిన తాటాకుల కొట్టం బుధవారం రాత్రి నిప్పు అంటుకుని దగ్ధమైంది. దీనికి కారణం అన్బళగన్ అని దయాలన్ అనుమానించాడు.
ఈ క్రమంలో దయాలన్ అతని సహోదరుడు శంకర్, బంధువులు, తిరుజ్ఞానం అరుణ్, ప్రభాకరన్, అళగు, కన్నన్, చక్రపాణి మారణాయుధాలు తీసుకుని అన్బళగన్ ఇంటిలోకి చొరబడి అక్కడున్న వస్తువులు ధ్వంసం చేశారు. అన్బళగన్, భార్య కవిత, చెల్లెలు తమిళరసిలపై దాడి చేశారు. ఈ ఘటనలో అన్బళగన్‌కు గాయాలయ్యాయి. అతన్ని పుదుచ్చేరి బిమ్స్ ఆస్పత్రికి తరలించా రు. అన్బళగన్ వర్గం వారు చేసిన దాడిలో ప్రత్యర్థి వర్గానికి చెందిన తిరుజ్ఞానం, శంకర్, అరుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చిదంబరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కొల్లిడం పోలీసులు ఇరు వర్గానికి చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.