London Mosque
-
‘ముస్లింలందరినీ చంపేందుకు వెళుతున్నాను’
లండన్: ‘నేను ముస్లింలందరినీ చంపేస్తాను’ అంటూ లండన్‌లో తాజాగా వ్యాన్‌తో పాదచారులను ఢీకొట్టిన వ్యక్తి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దీని ప్రకారం మొన్న జరిగిన దాడి మాదిరిగానే ఇది కూడా జాతి విద్వేషపూరిత దాడి అని తెలుస్తోంది.‘నేను ఎప్పుడైతే వెనక్కి చూశానో.. అది కారు ప్రమాదం అనుకున్నాను. కానీ ప్రజలంతా కేకలు పెడుతున్నారు.. అటుఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో ప్రార్థనలు చేస్తున్నవారినే లక్ష్యంగా ఆ వ్యక్తి ఎంచుకున్నాడు. నేను ముస్లింలను చంపేందుకు వెళుతున్నాను అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. మసీదు చాలా చిన్నగా ఉండటంతో అందులో సరిపోక చాలామంది బయటే ప్రార్థనలు చేస్తున్నారు. వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డాడు’ అని అబ్దుల్రహ్మాన్ శాలే అలామౌడీ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. -
లండన్‌లో మళ్లీ కలకలం..
-
లండన్‌లో మళ్లీ కలకలం.. వరుసగా ఢీకొట్టిన వాహనం
లండన్: పది రోజులు కూడా పూర్తవకముందే లండన్‌లో మరో దుర్మార్గం. గతంలో మాదిరిగానే పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి భీభత్సం సృష్టించింది. సరిగ్గా లండన్‌లోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సమీపంలోనే ఫిన్స్‌బరీ పార్క్ మసీదు ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగిసన తర్వాత ఈ మార్గం నుంచే ముస్లిలు వెళుతుంటారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని శోధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదిమిందిని ఈ వాహనం ఢీకొట్టింది. అంతకుముందు లండన్ బ్రిడ్జిపై కూడా ఉగ్రవాదుల వాహనం పాదచారులపైకి దూసుకెళ్లి పలువురు చనిపోయేందుకు కారణమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఘటనపట్ల పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది.