స్లీ ఈఈఈఈఈఈ వ్!
పొడవు చేతులండీ... బహు పొడవు చేతులండీ! తన పాదాలను తనే నమస్కరించుకునే పొడవు చేతులండీ! స్టైల్ కొత్తదండీ లాంగ్ లివ్ అండీ!!
►భుజాల మీదుగా దుపట్టాను కప్పుకున్న విధంగా రూపుకడుతుందీ స్టైల్. లాంగ్ స్లీవ్స్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న కేప్ డిజైన్ ఇది.
►పొడవులో లెహంగాతో పోటీపడుతున్న లాంగ్ స్లీవ్స్ ఇప్పుడు అతివల అందానికి కొత్త సొబగులు అద్దుతాయి.
►రాచ కళ ఉట్టిపడేలా, మత్స్య సుందరిని తలపించే రెడ్‌కార్పెట్ డ్రెస్ ఇది. లాంగ్ వెస్ట్రన్ గౌన్‌కి పొడవాటి స్లీవ్స్ ప్రధాన ఆకర్షణ.
► తెల్ల కలువకు బంగారురేకులు తాపడం చేసినట్లుందీ లాంగ్ స్లీవ్స్ బ్లవుజ్. సంప్రదాయ వేడుక... మోడరన్ ఫంక్షన్... దేనికైనా స్పెషల్ అట్రాక్షన్ ఇది.
► లాంగ్ అనార్కలీ గౌన్‌కి దుపట్టాలా అమరిన లాంగ్ స్లీవ్స్ ఈ డ్రెస్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేసింది. ఈవెనెంగ్ వెస్ట్రన్ వేడుకలకు ప్రధాన ఆకర్షణను తెచ్చిపెడుతుంది.
► వెస్ట్రన్ లాంగ్ గౌన్‌కి చీలికలుగా ఉండే లాంగ్ స్లీవ్స్ చూపులను కట్టడి చేస్తుంది.
► పలాజో ప్యాంట్ మీదకు లాంగ్ స్లీవ్స్ డిజైనర్ కేప్! వెస్ట్రన్ వేడుకలో స్టైలిష్‌గా వెలిగిపోయే డ్రెస్.