love fair
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాలూరు(విజయనగరం): తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగిక రించరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులోని కర్రివీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బుల్లిపల్లి రాములు(21) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వృత్తి విద్యా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అదే కాలనీకి చెందిన చౌడిపల్లి జ్యోతి(16)ని ప్రేమించాడు. దీనికి ఆ అమ్మాయి కూడా అంగీకరించడంతో.. వారి జీవనం సాఫీగా సాగిపోతుండగా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఏమంటారో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులిద్దరూ ఈ రోజు రాత్రి ఎవరి ఇంట్లో వాళ్లు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ప్రేమకు దూరమై... ఇద్దరి ఆత్మహత్య
మధిర: ఇరువురూ ప్రేమించుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించలేక ఇరువురూ ప్రేమను పక్కన పెట్టి వేరే వ్యక్తులను పెళ్లాడారు. జీవిత భాగస్వాములతో ఇమడలేక ఆ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మధిరలోని హనుమాన్ కాలనీకి చెందిన నరసింహారావు (25), కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం భగవానులపురం గ్రామానికి చెందిన భూలక్ష్మి(22) గతంలో ప్రేమించుకున్నారు. అయితే, ఆరు నెలల క్రితం వీరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు అయ్యాయి. అయితే, తమ జీవిత భాగస్వాములతో కలసి జీవించలేక నరసింహారావు, భూలక్ష్మి మంగళవారం మధిర పట్టణం బైపాస్ రోడ్డులో పురుగుల మందు తాగారు. వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందారు.