breaking news
love films
-
ప్రేమికుల రోజున ఎన్నో ప్రేమ చిత్రాలు
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి. మార్గాలు, పద్ధతులు ఎన్ని మారినా ‘ప్రేమ’కు భావోద్వేగం అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే అని ప్రేమ ఫిలాసఫర్లు వాదిస్తున్నారు. అసలు ఏది నిజమైన ప్రేమ ? అంటూ ఇప్పటికీ అన్వేషిస్తున్నవారు, నిజమైన ప్రేమను ఎలా దక్కించుకోవాలంటూ శోధిస్తున్న వాళ్లూ సమాజంలో అక్కడక్కడా మనకు కనిపిస్తారు. అలా శోధించే ఇద్దరు యువకులకు సంబంధించిన ప్రేమ కథే ‘లవ్ ఆజ్ కల్ 2’ బాలీవుడ్ చిత్రం ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అందులో వీర్, జో అనే కథానాయకులిద్దరూ ప్రేమాన్షేషణలో తమ అదష్టాన్ని వెతుక్కుంటూ వెళతారు. కార్తీక్ ఆర్యన్, సార అలీ ఖాన్, అరుషి శర్మ, రందీప్ హూడ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఎంత మేరకు ప్రేమను పడ్డిస్తుందో, ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. వరల్డ్ ఫేమస్ లవర్ ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని నేటి తరం యువ నటుడు విజయ్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా నాలుగు కథల సమాహారం. ఓ గ్రామంలో సీనయ్య, సువర్ణ అనే మధ్య తరగతికి చెందిన ఓ జంట ప్రేమించుకోవడం, గౌతమ్ అనే రోమాంటిక్ హీరో పారిస్ వీధుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ఐజాతో తిరగడం, కార్మిక సంఘం నాయకుడు హై హీల్స్ సుందరి అయిన తన బాస్‌ను ప్రేమించడం, మరో కాలేజీ ప్రేమ కథ సమాహారమే ఈ సినిమా. ఇందులో విజయ దేవరకొండతోపాటు రాశి ఖన్నా క్యాథరినా ట్రేసా, ఇజా బెల్లా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ మై కడువలే ప్రేమ ప్రపంచంలో ఈత కొట్టడం, మిత్రులతో ఎల్లప్పుడూ సరదాగ గడపడమే ప్రధాన సూక్తిగా విడుదలవుతున్న ఈ తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి, అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిప్పాప్ తమిళ, ఐశ్వర్య మీనన్‌లు నటించిన మరో తమిళ సినిమా ‘నాన్ సిరిథాల్’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. ఆపేక్ష పీ మహేశ్, ఆశిక్ నటించిన కన్నడ చిత్రం ‘సగుటా దూర దూర’, విక్రమ్ రవిచంద్రన్, ఆకాంక్ష శర్మ నటించిన మరో కన్నడ చిత్రం ‘త్రివిక్రమ్’, ప్రజ్వల్ దేవరాజ్, భావన నటించిన ‘ఇనిస్పెక్టర్ విక్రమ్’ కన్నడ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. పలు బెంగాలీ, పంజాబ్, మరాఠీ చిత్రాలతోపాటు పలు ఆస్కార్ అవార్డులు పొందిన ‘జోకర్, వన్సాపనే టైమ్ ఇన్ హాలివుడ్లతోపాటు ఫాంటసీ ఐలాండ్, ఆర్డినరీ లవ్, బెర్లిన్ ఐ లవ్ యూ చిత్రాలు ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని కొత్తగా విడుదలవుతుండగా, కొన్ని పునర్ విడుదలవుతున్నాయి. -
ఆ ప్రేమ ఎంతో బలమైనది!
సమంత మంచి నటి మాత్రమే కాదు... బంగారంలాంటి అమ్మాయి అంటే అతిశయోక్తి కాదు. రియల్ లైఫ్‌లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. ‘రియల్ హీరోయిన్’ అనిపించుకుంటున్నారీ బ్యూటీ. సినిమాలూ, సేవా కార్యక్రమలతో ఎప్పుడూ బిజీగా ఉంటారామె. ఇంత బిజీగా ఉంటే లైఫ్ బోర్ అనిపించదా? అనే ప్రశ్న సమంత ముందుంచితే - ‘‘ఇలా బిజీగా ఉండటం చాలా అదృష్టం. నాకన్నా గొప్ప అందగత్తెలూ, ప్రతిభావంతులూ ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ, హీరోయిన్ అయ్యే అవకాశం నాకే దక్కింది. అలాంటప్పుడు నా వృత్తిని నేనెంత ప్రేమించాలి? ఆ ప్రేమకు హద్దులు ఉండకూడదు. సినిమాల మీద నాకున్న ప్రేమ చాలా బలమైనది. ఒక్కోసారి ఇంటికి కూడా వెళ్లబుద్ధి కాదు. షూటింగ్ లొకేషన్లోనే నాకు చాలా ఆనందం దొరుకుతుంది. సినిమా అనేది పూర్తిగా నా జీవితం అయిపోయింది’’ అన్నారు.