
ఆ ప్రేమ ఎంతో బలమైనది!
సమంత మంచి నటి మాత్రమే కాదు... బంగారంలాంటి అమ్మాయి అంటే అతిశయోక్తి కాదు. రియల్ లైఫ్‌లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. ‘రియల్ హీరోయిన్’ అనిపించుకుంటున్నారీ బ్యూటీ. సినిమాలూ, సేవా కార్యక్రమలతో ఎప్పుడూ బిజీగా ఉంటారామె. ఇంత బిజీగా ఉంటే లైఫ్ బోర్ అనిపించదా? అనే ప్రశ్న సమంత ముందుంచితే - ‘‘ఇలా బిజీగా ఉండటం చాలా అదృష్టం.
నాకన్నా గొప్ప అందగత్తెలూ, ప్రతిభావంతులూ ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ, హీరోయిన్ అయ్యే అవకాశం నాకే దక్కింది. అలాంటప్పుడు నా వృత్తిని నేనెంత ప్రేమించాలి? ఆ ప్రేమకు హద్దులు ఉండకూడదు. సినిమాల మీద నాకున్న ప్రేమ చాలా బలమైనది. ఒక్కోసారి ఇంటికి కూడా వెళ్లబుద్ధి కాదు. షూటింగ్ లొకేషన్లోనే నాకు చాలా ఆనందం దొరుకుతుంది. సినిమా అనేది పూర్తిగా నా జీవితం అయిపోయింది’’ అన్నారు.