నా స్థానానికి ఎవరూ చేరుకోలేరు | No one can reach my level, says samantha ruth prabhu | Sakshi
Sakshi News home page

నా స్థానానికి ఎవరూ చేరుకోలేరు

Published Fri, Nov 13 2015 9:49 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

నా స్థానానికి ఎవరూ చేరుకోలేరు - Sakshi

నా స్థానానికి ఎవరూ చేరుకోలేరు

చెన్నై :  నా స్థానానికి ఎవరూ చేరుకోలేరు అంటోంది నటి సమంత. దీన్ని అహంకారంగా కాకుండా ఆమె ఆత్మవిశ్వాసంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కోలీవుడ్, టాలీవుడ్‌లలో నంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటీమణుల్లో ఈమె ముందు వరుసలో ఉన్నారు. తమిళంలో విజయ్‌తో ఒక చిత్రం, సూర్యకు జంటగా 24 చిత్రం ధనుష్‌తో తంగమగన్, వడచెన్నై అంటూ యమ బిజీగా ఉన్నారు.

తెలుగులోనే తన క్రేజ్ ఏమాత్రమూ తగ్గకుండా జాగ్రత్త పడుతున్న సమంత ఇటీవల అవయవదానం చేశారు. తాము ఇతరులకు సాయం చేయాలంటే డబ్బు అవసరం. అలాంటి ధనం లేకుండా చేసే సాయం అవయవదానం. అంతే కాదు మరణించిన తరువాత కూడా మనల్ని ఈ లోకంలో జీవించేలా చేసేది అవయవ దానం అందుకే తాను అవయవదానం చేసినట్లు సమంత పేర్కొంది.

ఈ చెన్నై చిన్నది 2016లో కూడా తన డైరీ పుల్ చేసుకుంది. అందుకే అంటున్నా ఈలోపు ఎవరయినా హిట్ చిత్రాలతో హవా సాగించినా తన స్థానానికి చేరుకోలేరు. తన స్థానం తనదే అనే ధీమాను సమంత వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె ఎంతో ఊహించిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం పరాజయం సమంతను చాలనే కలచివేసిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement