మంటల్లో ప్రేమ జంట
⇒ పెళ్లి జరగదని ఒంటికి నిప్పంటించుకున్న ప్రేమికులు
⇒ అక్కడికక్కడే మృతి చెందిన ప్రియురాలు
⇒ మృత్యువుతో పోరాడుతున్న ప్రియుడు
హైదరాబాద్: వారిద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విధి వక్రీకరించి ప్రేమికుడికి కిడ్నీ వ్యాధి సోకింది. ఏడాది కింద కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ఈ కష్టాలకు తోడు కులాల అడ్డుగోడలు వారిని దూరం చేసేందుకు ప్రయ త్నించాయి. దీంతో ఇద్దరూ చనిపోదామని నిర్ణయించుకున్నారు. స్నేహితుడి గదికి వచ్చా రు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటిం చుకున్నారు. అగ్నికీలల్లో యువతి మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు!
ఫ్రెండ్ ఇంటికి వెళ్లి..
మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సంయుక్త(22) కూకట్‌పల్లిలోని జేఎన్టీ యూలో ఇంజనీరింగ్ ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది. ఆమె తల్లి మెదక్ జిల్లా శివం పేట మండల తహసీల్దార్. నర్సాపూర్‌కే చెం దిన అభిలాష్(25) హయత్‌నగర్‌లోని బ్రిలి యంట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2013లో ఇంజ నీరింగ్ పూర్తి చేశాడు. ఈయన తండ్రి మెదక్ జిల్లా కౌడిపల్లి వీఆర్వో. ప్రస్తుతం అభిలాష్ గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కిడ్నీ వ్యాధి సోకడంతో సంవత్సరం కిందటే ఈయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు.
చికిత్స కోసం నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నాడు. సంయుక్త, అభిలాష్ మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. గురు వారం చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన అభిలాష్.. తన స్నేహితుడు తిమ్మప్పకు ఫోన్ చేశాడు. చికిత్స కోసం వచ్చానని, రూంలో ఒక రోజు ఉంటానని చెప్పాడు. గురువారం రాత్రి రాంనగర్‌లోని శివస్తాన్పూర్లోని అతడు అద్దెకుంటున్న గదికి వెళ్లాడు. తిమ్మప్ప శుక్రవారం ఉదయం 8 గంటలకు చదువుకునేందుకు వెళ్లగా.. మరో రూంమేట్ ఉద్యో గానికి వెళ్లిపోయాడు.
పెట్రోలు తెచ్చుకొని.. నిప్పంటించుకొని..
రూమ్‌లో ఉన్నవారు బయటకు వెళ్లడంతో అభిలాష్.. సంయుక్తకు ఫోన్ చేసి పిలిపిం చుకున్నాడు. ఇద్దరు గదిలో దాదాపు 4 గంటల పాటు ఉన్నారు. అనారోగ్యం, పెళ్లికి అడ్డం కులను తలచుకొని బాధపడ్డారు. ఎలాగూ పెళ్లి కాదని, కలసి మరణిద్దామని నిర్ణయిం చుకున్నారు. అభిలాష్ గోల్కొండ చౌరస్తాకు వెళ్లి పెట్రోలు తెచ్చుకొని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. కేకలు, పొగలు రావడంతో పక్కనే ఉన్న యువకులు తలుపు లు పగులగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే సంయుక్త అగ్నికి ఆహుతి అయింది. అభిలాష్ ప్రాణాలతో ఉన్నాడు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్, చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య వచ్చి విచారణ చేపట్టారు.
కాలిబూడిదైన మిత్రుడి సర్టిఫికెట్లు
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తిమ్మప్ప గత 5 సంవత్సరాలుగా ఇదే రూంలో ఉంటూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవలనే ఎస్సై పరీక్షలు రాశాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే రూంలో జరిగిన ఘటనతో ఆయన సర్టిఫికెట్లు మొత్తం కాలి బూడిదయ్యాయి.