Loved One
-
ప్రేమ వివాహం వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామానికిచెందిన యలమకురు చరణ్‌కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ జె.రవికుమార్ కథనం మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కె. సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన యలమకురు యల్లప్ప కుమారుడు ఎస్సీ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమవివాహం చేసుకోవద్దని తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియుడిని కలవనివ్వలేదని ఆత్మహత్యాయత్నం
అనంతపురం(గోరంట్ల): తమ ప్రేమను ప్రియుడి తల్లిదండ్రులు నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గోరంట్ల మండలానికి చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన తన క్లాస్మేట్ అశోక్, సదరు యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అశోక్‌ను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ప్రియుడిన కలిసేందుకు ఆ యువతి అనంతపురం మండలం బుదిలికి వెళ్లింది. అయితే యువతిని ఇంట్లోకి రాకుండా యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన యువతి 18 బ్రూఫిన్ ట్యాబ్లెట్లు మింగి బుదిలి బస్టాండ్‌లో ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు.