
చరణ్‌కుమార్(ఫైల్)
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామానికిచెందిన యలమకురు చరణ్‌కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ జె.రవికుమార్ కథనం మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కె. సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన యలమకురు యల్లప్ప కుమారుడు ఎస్సీ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమవివాహం చేసుకోవద్దని తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com