LOVER HOME
-
ఏడేళ్లుగా ప్రేమ.. ఉద్యోగం రావడంతో మరో యువతితో..!
ఖమ్మం(కారేపల్లి): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆయన ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష చేపట్టింది. కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన నూనావత్ పరోషన్ బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భూక్యా సురేష్, ఆమె ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయి తే ఇటీవల సురేష్‌కు రైల్వేలో ఉద్యోగం రావడంతో ఇంకో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసినా పరోషన్ తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఒప్పుకోలేదు. దీంతో ఆమె తన కుటుంబీకులతో సహా సురేష్ ఇంటి ఎదుట శుక్రవారం మౌనదీక్ష చేపట్టింది. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పరోషన్ ఫిర్యాదు చేసింది. -
ఫేస్బుక్లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్రీనగర్‌కాలనీకి చెందిన యువతి(24), మండలంలోని ఇప్పటూర్ పంచాయతీ చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్(25)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం తిలక్‌గౌడ్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టానంది. ఈ విషయమై బాధితురాలు నవాబుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపారని వివరించింది. చదవండి: రెండు పెళ్లిళ్లు.. మరొక వ్యక్తితో సహజీవనం..చివరకు -
వెంట పడి పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి
భీమవరం అర్బన్: ప్రేమ పేరుతో మోసగించిన యువకుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఉదంతం మండలంలోని వెంప గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గుత్తుల లావణ్య ఇంటర్మీడియట్ చదివి ఇంటివద్దే ఉంటుంది. ఆమె కథనం ప్రకారం.. వెంప గ్రామానికి చెందిన బొక్కానరేష్ రెండేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. లావణ్య వెంట పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పాడు. వెంప గ్రామంలో ప్రియుడు నరేష్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న లావణ్య నరేష్ కుటుంబ సభ్యులకు పరిచయం చేసి తరచూ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లేవాడు. కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మొహం చాటేసేవాడని.. ఇటీవల పెళ్లి చేసుకోమని గట్టిగా అడిగితే డబ్బులు తీసుకుని ఈ విషయం మార్చిపోవాలని నరేష్, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వాపోయింది. సంఘ పెద్దలు చర్చించి వివాహం చేసుకోవాలని చెప్పడంతో గురువారం రాత్రి నరేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నరేష్ తనను పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ ఇంటిముందు టెంట్ వేసి ఆందోళనకు దిగింది. బాధితురాలు లావణ్యకు కుటుంబ సభ్యులు, స్థానికులు మద్దతుగా నిలబడ్డారు. విషయం తెలుసుకున్న మొగల్తూరు ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. -
సినిమా సీన్లనే తలదన్నే లవ్ స్టోరీ..!
విశాఖపట్నం: సినిమాలలో ప్రేమ కథలు మొదట్లో హీరో, హీరోయిన్ల పరిచయం.. ఆ తర్వాత అంతా సవ్యంగా సాగిపోతూ.. ఆపై పెద్దవాళ్లు పెళ్లికి నో చెప్పడం, ఏదో ఒకటి చేసి హీరోయిన్ కుటుంబాన్ని హీరో ఒప్పించడం జరుగుతుంటాయి. సినిమా సన్నివేశాన్ని తలదన్నే సీన్ ఒకటి విశాఖలో జరిగింది. ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే రీల్ లైఫ్ లో ఓకే కానీ, రియల్ లైఫ్ లో జరగడం షాకింగ్ సంఘటన. సినిమాలో తరహాలోనే వీరి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రేయసికి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని తెలుసుకున్న ఆ ప్రేమికుడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఓ వైపు నిశ్చితార్థ వేడుక కనుక ఇంట్లో పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఇంతలో ఊహించని ట్విస్ట్.. మరికొద్ది నిమిషాల్లో ఎంగేజ్ మెంట్ జరగనుండగా తన ప్రేయసిని అందరు చూస్తుండగానే ఆ యువకుడు ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కి సిద్ధంగా ఉన్న వ్యక్తితో పాటు రెండు కుటుంబాల వారు షాక్ తిన్నారు. ముద్దు పెట్టుకున్న యువకుడిపై తిరగబడి అతడ్ని కొడతారని అక్కడున్నవారు భావించారు. కానీ అక్కడ అలాంటిదేం జరగకపోగా వారి పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ ఓకే చెప్పారు. వారు ఎంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు, ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టం అన్నది ప్రేమజంట వివరించింది. దీంతో చేసేందేం లేక వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఎంగేజ్ మెంట్ పై ఎన్నో ఆశలతో వచ్చిన మరో కాబోయే వరుడు కుటుంబంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. -
ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయింపు
దామెర(ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లా): ఓ వివాహిత తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన మండలంలోని దామెరలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐత స్వర్ణలతకు ఎల్కతుర్తికి చెందిన ఓ వ్యక్తితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అప్పటికే ఆమె దామెరకు చెందిన పాటి ప్రవీణ్‌ను ప్రేమించింది. వివాహమైనా.. స్వర్ణలతతో ప్రవీణ్ వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఇద్దరు కలిసి ఉండగా.. స్వర్ణలత అత్తమామ గమనించి పోలీసులకు అప్పగించారు. స్వర్ణలత విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రవీణ్ చెప్పడంతో పెద్దమనుషుల సమక్షంలో ఇటీవలే విడాకుల పత్రం రాయించారు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ బాధితురాలు ప్రవీణ్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడే ఉంటానని తెలిపింది. అప్పటికే ప్రవీణ్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఎస్సై వెంకటరంగయ్యసూరి బాధితురాలితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
న్యాయం చేయాలని ప్రియురాలి దీక్ష
ముమ్మిడివరం: ప్రేమ వివాహం చేసుకుని, తల్లిదండ్రులు నిరాకరించడంతో ప్రియురాలిని వదిలించుకోవాలనుకున్న యువకుడి ఇంటి ముందు ఓ యువతి నిరసర దీక్ష చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయ పురం మండలం పేరవరానికి చెందిన వేముల దుర్గ తన అమ్మమ్మ స్వగ్రామమైన ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు చిట్టి చెరువులో కొంతకాలంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన శెనగల కృపాపాల్ ఏడాదిగా ఆమెతో ప్రేమ వ్యవహారం సాగించాడు. నెల రోజుల క్రితం ఆమె పేరవరంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం కృపాపాల్ అక్కడకు వెళ్లి, దుర్గను వెంట తీసుకొచ్చాడు. స్థానిక మహిపాల చెరువు వద్ద కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కృపాపాల్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతడి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పి, దుర్గను కోడలిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కృపాపాల్ ఆమెను కాట్రేనికోనలో వదిలిపెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, గుడిలో వివాహం చేసుకున్న కృపాపాల్ తనతో కాపురం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి నుంచి అతని ఇంటి ఎదుట దుర్గ నిరసన దీక్ష చేపట్టింది. ముమ్మిడివరం ట్రైనీ ఎస్సై ఎస్.రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, ఆమె వద్ద నుంచి వివరాల సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.