వలసలపై వేటు: అమెరికా బాటలో సౌదీ
నిబంధనలు కఠినతరం చేసే దిశగా అడుగులు
రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా..మరికొన్ని మాత్రం అనుసరిస్తున్నాయి. వాటిల్లో సౌదీ ఒకటి. 12.1 శాతంగా ఉన్న నిరుద్యోగాన్ని 2020 కల్లా ఉన్న తొమ్మిది శాతానికి తగ్గించాలనే లక్ష్యసాధనలో భాగంగా విదేశీ కార్మికులపై వేటువేయనుంది. తద్వారా నిరుద్యోగం తగ్గుతుందని ఆశిస్తోంది,. దీంతో తక్కువ వేతనాలు చెల్లించి కార్మికులను వినియోగించే కంపెనీలపై భారం పడనుంది.
ఈ కొత్త నింబంధనల వల్ల 12 మిలియన్ల విదేశీ కార్మికులు ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంది. ఇక నుంచి 500 నుంచి 2,999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో వంద శాతం సౌదీ పౌరులనే నియమించాలి. పది శాతం మాత్రమే ఉద్యోగాలిస్తే ఆ కంపెనీలను ‘లోయర్ గ్రీన్’ కేటగిరీగా రేటింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటింగ్ ప్లాటినంకు 16 శాతం, లోయర్ గ్రీన్‌కు ఆరు శాతంగా ఉంది. బాగా చదువుకుని పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఈ నిర్ణయం వారికి ఇబ్బంది కలిగించనుంది.