లోయరు సీలేరు ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం
మోతుగూడెం :
లోయరు సీలేరు విద్యు™Œ™త్ ప్రాజెక్టులోని డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో నెల రోజుల తర్వాత తిరిగి విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ ఎల్ మోహన్‌రావు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి డొంకరాయి పవర్‌కెనాల్ అత్యవసర మరమ్మతు పనుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన సంఘటన తెలిసిందే. పవర్‌కెనాల్ మరమ్మతులు పూర్తి కావడంతో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి డొంకరాయి మినీ పవర్‌హౌస్‌లో 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. విద్యుదుత్పత్తి ఆనంతరం విడుదలైన నీరు డొంకరాయి వపర్‌కెనాల్ ద్వారా ఫోర్‌బే జలాశయానికి చేరుతుంది. ఈ నీటితో పొల్లూరు జల విద్యుత్కేంద్రంలో బుధవారం రాత్రి హైదరాబాద్ విద్యుత్ సంస్థ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తి ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.