సరోజనీ ఆస్పత్రిలో లోకాయుక్త విచారణ
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది. లోకాయుక్త ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకుని, బాధితులతో మాట్లాడారు. కలుషిత సెలైన్ కారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి చూపు పోవటంతో బాధితుల సంబంధీకుల నుంచి వివరాలు సేకరించారు.