గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం ఇలా..
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సబ్సిడీకి ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వెంటనే సబ్సిడీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తారు. గతంలో ఆధార్‌ను లింక్ చేసుకున్న వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ కోసం ఆధార్ అనుసంధానం చేసుకోని వారు సంబంధిత గ్యాస్ డీలర్ వద్ద ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. లేదంటే నాన్ సబ్సిడీ కింద సిలెండర్ వస్తుంది. దీని ధర రూ.969గా ఉంటుంది.
-కుత్బుల్లాపూర్
ఆధార్‌తో గ్యాస్ అనుసంధానం ఇలా...
ఇందుకు డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ఆఫ్ ఎల్పీజీ సబ్సిడీ ఫామ్‌ను పూర్తి చేయాలి.
ఇందులో మీ ఆధార్ నంబరు, కంజుమర్ గ్యాస్ నంబరు, రిజిష్టర్ ఫోన్ నంబరు తదితర అంశాలు పొందుపర్చాలి.
ఆధార్ కార్డు జిరాక్స్, గ్యాస్ పాస్ బుక్ జిరాక్స్, తాజాగా పొందిన బిల్ రశీదును జత చేయాలి.
బ్యాంక్ అనుసంధానం ఇలా...
ఇందుకు బ్యాంక్ అకౌంట్-ఆధార్ లింకేజ్ ఫామ్ పూర్తిచేయాలి.
ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ ఆధార్ నంబరు పొందుపర్చి, దాని జిరాక్స్ జత చేయాలి.
ఆధార్ కార్డు లేని వారు ఇలా...
మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి సంబంధిత దరఖాస్తును తీసుకోండి.
అందులో నిర్దేశిత కాలంలో వివరాలు నింపండి.
అన్ని పూర్తయ్యాక మీ దరఖాస్తును ఏజెన్సీ వారికి ఇస్తే వారు ఒక ఎల్పీజీ ఐడిని కేటాయిస్తారు.
రెండో ఫామ్‌లో కేటాయించిన ఎల్పీజీ ఐడిని పేర్కొని దాన్ని బ్యాంక్‌లో అందించండి.
ఈ నంబరుతో మీ ఎకౌంట్‌ను అనుసంధిస్తారు.
నోట్: బ్యాంక్, ఆధార్ లింక్ చేసే దరఖాస్తులు ఫామ్-1, ఫామ్-2 సంబంధిత వెబ్‌లో అందుబాటులో ఉంటాయి. కానీ ఫామ్-3, ఫామ్-4లు మాత్రం ఏజెన్సీల వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అందించడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఆధార్ కార్డు లేనివారు ఈలోగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని, కార్డు వచ్చిన వెంటనే గ్యాస్ ఏజెన్సీ వారికి అందజేయాలి.
టోల్ ఫ్రీ నంబర్: 1800 233 3555