రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది.
► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు.
ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు..
► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్
► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్
► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్
► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్
► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్
► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్
► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్
► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్.