మార్చిలో ఆడి రికార్డ్ అమ్మకాలు
హైదరాబాద్: జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ, ఆడి ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కార్లను విక్రయించింది.గత ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మార్చి అమ్మకాలు 4.4 శాతం వృద్ధితో 1,77,950కు పెరిగాయని ఆడి కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ చరిత్రలోనే ఒక్క నెలలో ఇంత అధిక సంఖ్యలో వాహనాలు విక్రయించడం ఇదే మొదటిసారని కంపెనీ డెరైక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ల్యూకా డి మియో పేర్కొన్నారు.
ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 6 శాతం వృద్ధితో 4,38,250కు చేరాయని వివరించారు. వీటిల్లో ఏ3 కార్లు 44 శాతం, ఆడి క్యూ3 10 శాతం, ఆడి ఏ6 కార్ల వాటా 8 శాతమని తెలిపారు. అన్ని దేశాల్లో తమ కార్ల విక్రయాలు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. వరుసగా 63 నెలల్లో తమ అమ్మకాలు వృద్ధిబాటలోనే ఉన్నాయని వివరించారు.