లక్నో దోపిడీలో ‘జానకీపురం’ మృతులు?
లక్నో: సంచలనం సృష్టించిన లక్నో ఏటీఎం దోపిడీలో నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్కౌంటర్లో మరణించిన సిమి తీవ్రవాదుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఆ దోపిడీలో.. ఏటీఎంలో నగదు నింపుతున్నప్పుడు వచ్చిన దుండగులు భద్రతా సిబ్బందిలో ముగ్గుర్ని అత్యంత సమీపంనుంచి కాల్చేసి రూ. 50 లక్షల నగదు దోచుకెళ్లారు.
దీంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని సోమవారం నల్లగొండకు పంపిస్తున్నామని లక్నో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ యశస్వి యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎనిమిది సంఘటనలతో పాటు అనేక దోపిడీల్లో మరణించిన తీవ్రవాదుల హస్తం ఉందని తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారని తెలిపారు.