breaking news
Lunar Eclipse
-
బ్లడ్ మూన్.. వెరీ స్పెషల్..!
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి. వచ్చే బ్లడ్ మూన్ వరకూ హైదరాబాదీలు ఈ జ్ఞాపకాన్ని ఫొటోల రూపంలో, పోస్టుల రూపంలో ఆస్వాదిస్తూ మిగిలిపోతారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ జరిగిన చంద్ర గ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రుడు ఎర్రటి వర్ణంలో మెరిసిపోవడం వల్ల దీనిని ప్రజలు బ్లడ్ మూన్ అని పిలిచారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఖగోళ క్షణం హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రహణానికి గంటల ముందే ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్బుక్ వేదికలు హాష్‌ట్యాగ్‌లతో సందడి చేశాయి. కొందరు గ్రహణం ఫొటోలు పంచుకుంటే, మరికొందరు ‘బ్లడ్ మూన్ అంటే ఏమిటి?’ అనే గూగుల్ సెర్చ్‌లో మునిగిపోయారు. ఒక్క రాత్రిలోనే వేల పోస్టులు, వీడియోలు షేర్ కావడం గమనార్హం. ముఖ్యంగా యువత ఈ గ్రహణాన్ని ఫొటోషూట్లుగా మార్చుకుని #సెలనోఫైల్ #బ్లడ్ మూన్ వంటి హాష్‌ట్యాగ్‌లతో క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారు. సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలు.. ఒకవైపు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు ఈ ఘటనకు వెనుక ఉన్న ఖగోళ శా్రస్తాన్ని వివరించగా, మరోవైపు సోషల్ మీడియాలో మూఢనమ్మకాలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి. ‘గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు’, ‘ఆహారం తినకూడదు’ వంటి అపోహలను కొందరు జోరుగా ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియం నిపుణులు, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్, ఐఐటీఎస్ శాస్త్రవేత్తలు ఈ గ్రహణం సహజ ఖగోళ సంఘటన అని, దీనికీ మన ఆరోగ్యం లేదా దైనందిన జీవితానికీ ఎటువంటి సంబంధం, ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ‘బ్లడ్ మూన్ కేవలం విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి అందించే అద్భుత క్షణం’ అని వివరించారు. బ్లడ్ మూన్ అంటే? సాధారణంగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్ర గ్రహణం జరుగుతుంది. కానీ ఈ సమయంలో సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని దాటి చంద్రుని చేరుకున్నప్పుడు, నీలి కాంతి ఫిల్టర్ అవుతుంది, ఎర్రటి కాంతి మాత్రమే చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. గతం–భవిష్యత్తు బ్లడ్ మూన్‌లు.. చరిత్ర చెబుతున్నట్లు.. గతంలో హైదరాబాద్‌లో 2018 జూలై 27న ఒక విశేషమైన బ్లడ్ మూన్ కనిపించింది. అది 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన చంద్ర గ్రహణంగా రికార్డయ్యింది. 2022లో కూడా కనిపించిన ఈ బ్లడ్ మూన్ ఈ ఏడాది మార్చిలోనూ కనువిందు చేసింది. 2026లో మరో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఈ విధంగా తరచూ కాకపోయినా, కొన్ని ఏళ్లకోసారి మాత్రమే ఈ అపూర్వ క్షణాలు మన కళ్లముందు మెరుస్తాయి.హైదరాబాద్ ప్రత్యేకత.. హైదరాబాద్ ఆకాశం నుండి చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడం ఈ సారి ప్రత్యేకత. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో, గోల్కొండ కోట ప్రాంగణంలో, షామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో చాలా మంది ఫొటోగ్రాఫర్లు, సెలనోఫైల్స్ టెలిస్కోపులతో గ్రహణాన్ని ఆస్వాదించారు. టెర్రస్ పార్టీల రూపంలో కూడా బ్లడ్ మూన్ నైట్ జరుపుకున్నవారు ఉన్నారు. చంద్రుడి అందాన్ని ఆస్వాదించే వారికి ‘సెలనోఫైల్స్’ అని పేరు. ఈ తరం యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇది ‘అంతరిక్షంతో కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని పలువురు యువత భావించారు. (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్ర గ్రహణం ముగిసింది. భారత్‌లో కూడా అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి.తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. సుమారు 12 గంటల అనంతరం మహా ద్వారం తెరిచారు. గ్రహణం వీడటంతో ఆలయ శుద్ది, పుణ్యాహవచనం చేశారు అర్చకులు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతోంది.ఇటు, తెలంగాణలో వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటలపాటు ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం ముగియడంతో తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసిన అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి చుట్టూ కోడెను తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుండి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక, భద్రాచలంలో ఉదయం 7.30 నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రాత్రి 11.01 గంటల నుంచి అర్ధరాత్రి 12.23 గంటల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. -
రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?
ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుదైన బ్లడ్ మూన్ ఘట్టం చోటు చేసుకోవడంతో ప్రపంచమంతా ఈ దృశ్యాన్ని చూసేందుకు తహతహలాడుతోంది. దాదాపు.. రెండేళ్ల తర్వాత ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. భూమి.. సూర్యుడు.. చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు... భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లడ్ మూన్’గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడిందని, దీని ప్రకారం భూమి నీడ జాబిల్లిని 99.1 శాతం కప్పేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారత కాలమానం ప్రకారం ఉదయం 11.57 గంటలకు గ్రహణం మొదలైంది. మధ్యాహ్నం 12.29 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుని దాదాపు గంట పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.01 గంటలకు గ్రహణం పూర్తయ్యింది. మొత్తం 3గం. 38 ని.లోనే గ్రహణం మూడుదశలు పూర్తి చేసుకుంది. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భారత్‌లో పగటి సమయం. కాబట్టి మనకు కనిపించదు. అయితే.. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్థగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తోంది. ఉత్తర-దక్షిణ అమెరికా దేశాలు, పశ్చిమ ఐరోపా దేశౠలు, ఆఫ్రికా దేశాల్లోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ప్రత్యేకించి.. అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025యూరప్‌లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం గ్రహణం పూర్తయ్యే సమయానికి చంద్రుడు ఉదయించాడు. దీంతో అక్కడ ఎటువంటి పరికరాలు లేకుండానే గ్రహణాన్ని నేరుగా వీక్షించారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను పోస్టులు పెడుతున్నారు. #BloodMoon #LunarEclipse pic.twitter.com/ufNhgx5ccd— தோழர் Manic (@ManicBalaji) March 14, 2025సాధారణ గ్రహణాల సమయంలో చంద్రుడి పరిమాణం కాస్త పెద్దదిగా, ఎప్పుడు కనిపించే రంగులోనే దర్శనమిస్తాడు. కానీ, బ్లడ్‌మూన్ రోజున జాబిల్లి పూర్తిగా ఎరుపు, నారింజ రంగులో చూపురులను కనువిందు చేశాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఎరుపు, నారింజ కిరణాలు భూ వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడ్ని ప్రకాశింపజేస్తాయి. ఖగోళ పరిభాషలో దీనినే రేలీ స్కాటరింగ్ అంటారు.If i wasnt in the middle of a city, with tons of light pollution, I would have much better shots. These will have to do.#lunareclipse #bloodmoon pic.twitter.com/aABvGuXiWL— Jared Hardaway (@jartraxwx) March 14, 2025