Luxemburg
-
దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మాజీ విజేత పోర్చుగల్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘జె’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లక్సెంబర్గ్‌తో మ్యాచ్‌లో పోర్చుగల్ 6–0తో గెలిచింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్‌తో మెరిశాడు. ఆట 6వ, 31వ నిమిషంలో రొనాల్డో జట్టు తరపున గోల్స్ కొట్టాడు. మిగతావారిలో జావో ఫెలిక్స్(ఆట 15వ నిమిషం), బెనార్డో సిల్వా(ఆట 18వ నిమిషం), ఒటావియో(ఆట 77వ నిమిషం), రాఫెల్ లావో(ఆట 88వ నిమిషం)లో గోల్స్ సాధించారు. కాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో ప్రస్తుతం రొనాల్డో 122వ గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. లిష్టెన్స్టయిన్తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్ చేశాడు. -
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..
Cristiano Ronaldo Creates History By Scoring 10th International Hat Trick: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రొనాల్డో తన కెరీర్లో 58 హ్యాట్రిక్‌లు సాధించి, సమకాలీన ఫుట్‌బాలర్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్‌లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్‌లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
జాలీగా ఫోర్ డేస్ జాబ్..!
మనదేశంలో ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ‘వారానికి అయిదు రోజుల పని విధానం’ (ఫైవ్ డే వీక్)లో పనిచేస్తుండడం మనకు తెలిసిందే. శని,ఆదివారాలు సెలవులు ఉండడంతో ఫైవ్ డే వీక్ ఉన్న వారిని ఒకింత ప్రత్యేకంగానే చూస్తుంటాము. అయితే మనం మరింత ఆశ్చర్యపోయేలా న్యూజిలాండ్‌లోని ఒక సంస్థ వారానికి నాలుగు రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా మంచి ఫలితాలే వచ్చినట్టుగా ఆ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి ఉద్యోగులకు కూడా ఈ కొత్త పద్ధతి తెగ నచ్చేసిందిట. నాలుగు రోజులకు పనిచేసినందుకు అయిదురోజుల జీతం రావడం తమకు కలిసొచ్చే అంశంగా వారు పరిగణిస్తున్నారు. వారానికి నాలుగు రోజులే పని... న్యూజిలాండ్ ట్రస్టీ కంపెనీ ‘పర్పెక్చువల్ గార్డియన్’ ఈ పని విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థలోని 200 మంది ఉద్యోగులు మార్చి నెల మొదలైనప్పటి నుంచి ‘ఫోర్ డే వీక్’ పనిచేస్తున్నారు. ఆరువారాల పాటు అంటే ఏప్రిల్ 15 వరకు ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ గడువు ముగిశాక ఈ కాలానికి (45 రోజులకు) ఉద్యోగుల ఉత్పాదకత డేటాను ఒకచోట చేర్చి విశ్లేషిస్తారు. ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారో లేదా అన్న విషయం జులైలో ఉద్యోగులకు తెలియజేస్తారు. లగ్జంబర్గ్‌లో అత్యధిక ఉత్పాదకత... న్యూజిలాండర్లు ఏడాదికి సగటున 1,752 గంటలు పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్, కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)లోని సహచర సభ్యదేశాల్లోని (న్యూజిలాండ్‌తో కలుపుకుని మొత్తం 35 దేశాలు) ఉద్యోగులతో ఈ పనిగంటలు ఇంచుమించు సమానం. జర్మనీలో ఫైవ్డే వీక్‌లో భాగంగా ఉద్యోగులు 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. డెన్మార్క్‌లో వారానికి సగటున మహిళలు 35 గంటలు, పురుషులు 41 గంటలు పనిచేస్తుం టారు. నార్వేలో వారానికి సగటున 37,38 గంటలు పనిచేస్తారు. నెదర్లాండ్స్, మెక్సికో, కొరియా, కోస్తారికాలలోని ఉద్యోగులు కొంచెం అటు, ఇటుగా ఇన్ని గంటలే పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకత గల దేశంగా లగ్జంబర్గ్ నిలుస్తోంది. అక్కడి ఉద్యోగులు,కార్మికులు వారానికి కేవలం 29 గంటల పాటే పనిచేస్తున్నా ఈ ఘనతను సాధించడంలో భాగం పంచుకున్నారు. మంచి ఫలితాలే వచ్చాయి... ‘ఈ ప్రయోగం ద్వారా ఆసక్తికరమైన డేటా వస్తోంది. న్యూజిలాండ్‌లోని రెండు ప్రముఖ యూనివర్సిటీల విద్యా వేత్తలతో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. వచ్చే ఫలితాలను బట్టి మరి కొంతకాలం ఈ విధానాన్ని కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటాం. కొందరు ఉద్యోగులు తమకిచ్చిన సమయం కంటే ముందుగానే అప్పగించిన పని ముగిస్తున్నారు. ఉద్యోగుల్లో అధికశాతం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో ఈ విధానం అమలయ్యేందుకు వీలుగా మేము విజయం సాధించాలని ఇక్కడివారు కోరుకుంటున్నారు. అయితే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశమున్న ఈ విధానాన్ని ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరుత్సాహ పరుస్తోంది’ అని ‘పర్పెక్చువల్ గార్డియన్’ సీఈఓ ఆండ్రూ బార్న్స్ పేర్కొన్నారు. ‘వారంలో అదనంగా ఒకరోజు సెలవు లభించడాన్ని ఉద్యోగులు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు చేస్తున్న పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చాక సోమవారం మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మూడురోజుల వారాంతం సెలవులను బాగా ఉపయోగించుకుంటున్నారు’ అని ఆ సంస్థ ఉన్నతోద్యోగి క్రిస్టినీ బ్రదర్టన్ తెలిపారు. అదేబాటలో మరిన్ని సంస్థలు.. కొందరి ఉద్యోగులపై వారానికి 30 గంటల పనివిధానాన్ని అమేజాన్ సంస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తికాలం ఉద్యోగులకిచ్చే బెనిఫిట్స్ అన్ని వారికి కూడా ఇచ్చినా జీతం మాత్రం 75 శాతం ఇస్తారని తెలుస్తోంది. డెలాయిట్‌తో పాటు కేపీఎంజీ సంస్థ కూడా కొన్ని షరతులతో కొందరు ఉద్యోగులకు ‘ఫోర్ డే వీక్’ విధానాన్ని అమలుచేస్తోంది. గూగుల్ సంస్థ కూడా కొందరు ఉద్యోగులకు వారంలో తాము చేసే పనిలో 20 శాతం సమయాన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా గడిపేలా అవకాశం కల్పిస్తోంది. ఇలాంటి సృజనాత్మక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఈ సంస్థ భావిస్తోంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దంతవీరుడు
తిక్కలెక్క పంటిబిగువున కష్టాలను భరించామంటుంటారు చాలామంది కానీ, పళ్లతో బరువులెత్తే సాహసానికి ఒడిగట్టగలరా? బతికుంటే బలుసాకు తినొచ్చు... బరువులెత్తి పళ్లూడగొట్టుకోలేమనుకుంటున్నారా..? లగ్జెంబర్గ్ దంతవీరుడు జార్జెస్ క్రిస్టెన్ మాత్రం అలా కాదు. ఎంతటి బరువునైనా సునాయాసంగా పళ్లతోనే పైకి లేపేయడానికి సై అంటాడు. అనడమే కాదు, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో తన దంతదారుఢ్యాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి, వీక్షకులను నోరెళ్లబెట్టేలా చేశాడు. పన్నెండు కిలోల టేబుల్‌పై దాదాపు యాభై కిలోల బరువున్న సుందరాంగిని కూర్చోబెట్టి, పళ్లతోనే ఆ బరువును పైకి లేపాడు. పంటి బిగువున పైకి లేపిన టేబుల్, దాని మీద కూర్చున్న యువతి కింద పడకుండా 11.80 మీటర్లు సునాయాసంగా నడిచి, గిన్నెస్ బుక్‌లోకి ఎక్కాడు.