Lyricist Chandrabose
-
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
చంద్రబోస్‌కి మాతృవియోగం
ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరికి చెందిన చంద్రబోస్ తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు కాగా తల్లి మదనమ్మ గృహణి. వీరికి నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడు చంద్రబోస్. గతంలో ఓ సారి తన తల్లి గురించి చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు తల్లితో కలిసి మా గ్రామంలో ప్రదర్శించే ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూసేవాణ్ణి. వాటి వల్లే పద్యాలు, పాటలపై ఆసక్తి పెరిగింది. నేను పాటల రచయిత కావడం వెనక అమ్మ స్ఫూర్తి ఎంతో ఉంది’’ అన్నారు. కాగా చల్లగిరిలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ‘‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ’ అంటూ ‘నాని’ సినిమాలో తల్లి గురించి చంద్రబోస్ ఓ అద్భుతమైన పాట రాశారు. ఆ పాట అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎవర్గ్రీన్. -
చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం
వెంగళరావునగర్ (హైదరాబాద్) : ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 14వ తేదీనాడు రవీంద్రభారతిలో జరగనున్న కాళోజీ పురస్కార వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. స్థానిక మధురానగర్ కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఏటా టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మహాకవి కాళోజీ స్మారక పురస్కారాలను వివిధ రంగాల్లో రాణిస్తున్న రచయితలకు అందజేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఈ అవార్డును సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు, 2014లో జేకే భారవికి అందజేసినట్టు పేర్కొన్నారు. కాగా చంద్రబోస్‌కు పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ.10,116 నగదును అందించనున్నామన్నారు.