వేధింపులు తాళలేక.. ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు వేధించడంతో.. వరంగల్ జిల్లాలో ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వడ్డిచెర్ల గ్రామానికి చెందిన విజయ అనే విద్యార్థినిని ఓ యువకుడు చాలాకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తాను బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి కూడా అతడు తన వెంటపడి వేధిస్తున్నాడని ఆమె తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొంది.
తనను అతడు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్నా, ఊళ్లో అమ్మానాన్నలకు ఉన్న మంచిపేరు చెడగొట్టకూడదని తాను ఎవరి వద్దా ఈ విషయం చెప్పలేదని ఆమె తన లేఖలో వాపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవడం కుదరదని తాను చెప్పినా కూడా అతడు వినిపించుకోకుండా వేధిస్తున్నాడని, ఇక భరించడం తనవల్ల కావడంలేదని పేర్కొంటూ ఆమె పురుగుల మందు తాగింది.