ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటే ఆయుధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఉత్తమ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు బలమైన ఆయుధమని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. నా లుగవ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనేదే ఓటర్ల దినోత్సవ లక్ష్యమని పే ర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేయాలన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటర్ల నమో దు కార్యక్రమం ద్వారా అర్హులందరినీ చేర్పించామని తెలిపారు.
పస్తుతం జిల్లా ఓటర్లు 27,43,754 ఉన్నారని, వీరిలో 13,78,754 మంది పురుషులు, 13,67,000 మంది మహిళలు ఉన్నారని వివరించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. జిల్లా జడ్జి నాగమారుతీ శర్మ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వేయాలని పేరొన్నారు. శాతవాహన వీసీ వీరారెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగితే ఉత్తములే ఎన్నికల్లో విజయం సాధిస్తారని, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని వివరించారు. డీఐజీ భీమా నాయక్ , ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
సీనియర్ సిటిజన్లకు సన్మానం
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువసార్లు ఓటింగ్‌లో పాల్గొన్న సీనియర్ సిటిజన్లను సన్మానించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృ్తత్వం, పేయింటింగ్, క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ప్రత్యేక ఓటరు నమోదుకు కృషి చేసిన వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కెడెట్లకు ప్రశంసాపత్రాలు అందించారు.
అంతకుముందు విద్యార్థులతో సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో కృష్ణారెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, స్వాతంత్య్ర సమరయోధుడు బోయినిపల్లి వెంకటరామారావు, జిల్లా అధికారులు, యూత్ సోషల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు కిరణ్, డి.ప్రశాంత్, వలుస సుభాష్, రాజేశ్, కళింగ శేఖర్, సంపత్‌కుమార్, శివరాం, రాకేశ్, లోక్‌సత్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.