బీటెక్ విద్యార్థి మృతదేహానికి రీపోస్టుమార్టం
కొండూరు(వీపనగండ్ల), న్యూస్‌లైన్: మండలపరిధిలోని కొండూరుకి చెందిన బీటెక్ విద్యార్థి ఎం.వినోద్‌కుమార్ గతనెల 21వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం వద్ద తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లభించడంతో అప్పట్లో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశా రు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పోస్టుమార్టం సమయం లో డాక్టర్ సూచనతో కొల్లాపూర్ సీఐ విలేకర సమావేశంలో వినోద్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని వెల్లడించా రు. అయితే తన తమ్ముడి మృతిపై రీపోస్టుమార్టం నిర్వహించి నిజనిజాలు వెలికి తీయాలని ఇటీవల వినోద్ సోదరి వెన్నెల ఎస్పీ నాగేంద్రకుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా మార్చురీ ప్రొఫెసర్ సుధ కొండూరు శ్మశాన వాటికలో సీఐ టి.స్వా మి, తహశీల్దార్ శాంతకుమారి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించి రీపోస్టుమార్టం నిర్వహిం చారు. అంతకుముందు వినోద్‌కు ఏమైన అనారోగ్య సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అవయవాలను పరీక్షల నిమిత్తం కెమికల్ ఎనాలసిస్కు పంపించి తర్వాతే వివరాలను వెల్లడిస్తామని ప్రొఫెసర్ సుధ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా మార్చురీ సిబ్బంది రమణ, ఉమేష్, మోహిన్లతోపాటు ఏఎస్ఐ వహీద్ అలీ బేగ్, హెడ్ కానిస్టేబుళ్లు సైదోద్దీన్, శ్రీనివాసులు, ఎమ్మారై చక్రవర్తి, వీఆర్వోలు పాల్గొన్నారు.