మహానందిలో రూ. 2.07 కోట్లతో మాడా వీధులు
· ఆలయంలో సైన్‌బోర్డుల ఏర్పాటు
· పాలకమండలి సమావేశంలో తీర్మానాలు
మహానంది : మహానంది దేవస్థానంలో రూ. 2.07 కోట్లతో మాడా వీధుల నిర్మాణానికి మరోసారి టెండర్లను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకరవరప్రసాద్ తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో గురువారం సాయంత్రం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన తీర్మాన వివరాలను వారు వెల్లడించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు కమిషనర్ ఉత్తర్వుల మేరకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానంలో రూ.22 లక్షలతో ఏకాంత సేవ మండపం చుట్టూ అద్దాలు, నిత్యకల్యాణమండపంలో అల్యూమినియం పార్టీషియన్స్, రామాలయంలో అద్దాల మరమ్మతులు చేస్తామన్నారు. కానుకలు హుండీలలో వేయాలన్న సమాచారానికి సంబంధించిన బోర్డులను ప్రతి ఆలయంలో ఏర్పాటు చేయాలని పాలకమండలి సభ్యులు తీర్మానించారు. కమిషనర్ అనుమతిస్తే మహానంది క్షేత్ర అభివద్ధికి విశేష కషి చేసిన దివంగత మాజీ ధర్మకర్త మహానందయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. పందుల నివారణకు ఆలయ పరిసరాలలో గ్రిల్స్ ఏర్పాటు, ఉచిత దర్శనం కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఈఓ రాజశేఖర్, సూపరింటెండెంట్లు పరుశురామశాస్త్రి, ఈశ్వరరెడ్డి, ఏఈ మురళీధర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు సి బాలరాజు, రామకష్ణ, మునెయ్య, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, చింతకుంట్ల శివారెడ్డి, వేమూరి నారాయణ పాల్గొన్నారు.