macca
-
పవిత్రమైన మక్కాలో కారుతో హల్చల్
రియాద్ : ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మసీదు వద్ద భద్రతగా ఉన్న గార్డులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులు శనివారం ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బయట ఉన్న రెండు బారికేడ్లను అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అతడిని వెంబడించి నిలువరించినట్లు సమాచారం. కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరును సౌదీ అధికారులు వెల్లడించలేదు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదని మాత్రం తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపించామని వారు చెప్పారు. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఈ నెలలో తెరుచుకున్న విషయంత తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతించారు. (చదవండి : ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా భూకంపం..) Car ploughs through Grand Mosque courtyard in Makkah, crashes into door#Makkah #MasjidilHaram#SaudiArabia pic.twitter.com/YeB3qQeFE9 — Mohammad Jamlish Roy (@jamlishofficial) October 31, 2020 -
వైఎస్ జగన్ కు మద్దతుగా మక్కాలో ప్రార్థనలు
మక్కా : ఆంధ్రప్రదేశ్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సాయం మరచిపోలేరు అనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైఎస్ అవకాశం కల్పించారు. ఈ పథకంతో ఉన్నత చదువులు చదువుకొని సౌదీ అరేబియాలోని పలు ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తోన్న కొందరు ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కుటుంబం మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మక్కాలో ఉండే కాబాలో ఫోటోలతో ప్రార్థన చేయడం నిషేధం ఉన్నా, ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్తో చదువుకోని, జీవితంలో స్థిరపడ్డాము కాబట్టి గుండెల నిండా పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేశాము అని 'జగన్ కోసం టీమ్' సభ్యుడు షేక్ సలీం చెప్పారు. 'కులమత భేదం లేకుండా రాజశేఖర్ రెడ్డి తన పథకాలతో ఎందరినో చదివించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ అభిమానమే మక్కా మసీదు వరకు వెళ్లి వైఎస్ జగన్ కోసం ప్రార్థనలు చేసేలా చేసింది' అని గుంటూరు జిల్లా వేమూరు నియోజక వర్గంకు చెందిన షేక్ సలీం అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయబోయే పాదయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, అలాగే వైఎస్ జగన్కు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముస్లింలకు అత్యంతపవిత్ర స్థలమైన మక్కా మసీదులో 'జగన్ కోసం టీమ్' సభ్యులు ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు. వైఎస్ జగన్ కోరుకున్నట్టు ఈ పాదయాత్ర విజయవంతం కావాలని తన స్నేహితులతో కలిసి ముస్లింల ఆరాధ్య ప్రదేశం మస్జిద్ ఎ మక్కాలో ప్రత్యేకంగా ప్రార్ధనలు చేశామని షేక్ సలీం అన్నారు. పవిత్ర ఉమ్రా కూడా చేసి ఆ తరువాత తాము చేసిన అన్ని నమాజుల పుణ్యం మైనార్టీలకు తోడుగా నిలిచే జగన్కు దక్కాలని దువా చేసుకోనే కార్యక్రమం కూడా చేశామన్నారు. ఈ ప్రార్థనలు కూడా తనకు అత్యంత ఆప్తులైన మతగురువుల సలహాలను, సూచనలను తీసుకోని వారు చేప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో అన్ని నియమనిబంధనలను, పద్దతులను పాటించి వైఎస్ జగన్కు మద్దతుగా ఉమ్రా చేశామన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు మరోసారి ప్రార్థనలు చేస్తామన్నారు. పవిత్రమైనా జమ్ జమ్ నీటిని, అజ్వా ఖర్జురపండును వైఎస్ జగన్ ను కలిసి అందిచే కార్యక్రమం త్వరలో చేస్తామని 'జగన్ కోసం టీమ్' తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహమ్మద్ షబ్బీర్, షేక్ సిరాజ్, మహమ్మద్ అల్తాఫ్, షేక్ ఖాజావలి, ఇర్షాద్, షేక్ ఫరీద్లతో పాటూ మరికొందరు పాల్గోన్నారు. -
వారి మరణాలకు ఎందుకు స్పందించరు?: వైఎస్ జగన్
మచిలీపట్నం: మక్కా మసీదులో క్రేన్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఖాదర్, ఫాతిమా కుటంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హజ్ యాత్రకు వెళ్లి మక్కా మసీదు ప్రమాదంలో ఖాదర్, ఫాతిమా మృతి చెందిన విషయం తెలిసిందే. మచిలీపట్నం పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం ఖాదర్, ఫాతిమ కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హజ్ యాత్ర మృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పబ్లిసిటీ కోసం పుష్కరాలలో మేకప్ వేసుకుని షూటింగ్ చేసి 30మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆయన విమర్శించారు. పుష్కరాల మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన చంద్రబాబు దేవుడి కోసం హజ్ యాత్రకు వెళ్లిన వారి మరణాలకు ఎందుకు స్పందించరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అనంతరం ఆయన కరగ్రహారం బయల్దేరారు. -
మృతులకు మక్కాలోనే అంత్యక్రియలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారికి అక్కడే అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల బంధువుల కోరిక మేరకు మక్కాలోనే అంత్యక్రియలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మక్కా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు. మక్కా ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు 040-23214125 హెల్ప్ లైన్నంబర్ను ఏర్పాటు చేశారు.