మీడియాపై ఆంక్షలు తగదు
ఏపీయూడబ్ల్యూజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆదివారమిక్కడ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాజమండ్రిలో జర్నలిస్టులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సమావేశం తప్పుపట్టింది. సాక్షి, నంబర్ 1 చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.అమర్, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నేమాని భాస్కర్, ఆలపాటి సురేశ్, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.