ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు..
మచిలీపట్నం: కొత్తమాజేరు విషజ్వరాల బాధితుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న ధర్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించే విధంగా ఉందని వైఎస్ఆర్ సీపీ గన్నవరం ఇన్ఛార్జ్ గన్నవరం దుట్టా రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ జ్వరంతో బాధపడుతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థితి కూడా లేదన్నారు. అసలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు ఉన్నారా లేదా అని రామచంద్రరావు ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో నిద్ర చేస్తానని చెబుతున్నారని...ఆయన ఎప్పుడూ నిద్ర పోతూనే ఉంటారు. మెలుకువ ఉన్నప్పుడు రంగు వేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు.