Mackhand
-
మాచ్‌ఖండ్‌కు వెలుగులు
6 దశాబ్దాల తర్వాత ఆధునికీకరణకు ఆమోదం పెరగనున్న విద్యుత్ ఉత్పత్తి సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్ ప్రాజెక్టు వెలుగులీననుంది. ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా సిద్ధం అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా సహజ నీటి వనరుల ఆధారంగా రెండు రాష్ట్రాల ఖర్చుతో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకులు దూరని కారడవిలో విదేశీ పరిజ్ఞానంతో దీనిని నెలకొల్పారు. మొదటి రాష్ట్రపతి బాబూరాజంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది. అయితే కొన్నాళ్లు తర్వాత ఈ ప్రాజెక్టును ఇరు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి చీకట్లు అలముకున్నాయి. తరచూ కేంద్రం మరమ్మతులకు గురువుతూ వచ్చింది. అయినా పెద్దగా దృష్టి పెట్టింది లేదు. అయితే ఇప్పుడు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మరో 30 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దశల వారీగా పనులు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు 15 మెగావాట్లు, మిగిలినవి 27 మెగావాట్లు చొప్పున ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్ల వయోపరిమితి 40 ఏళ్లు కాగా.. 20 ఏళ్లు పైబడి వినియోగించారు. దీంతో ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల అంగీకారంతో ఈ యూనిట్లకు కొత్త పరికరాలు అమర్చనున్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం ఇక్కడ 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆధునికీకరణ చేపడితే ఒక్కో యూనిట్‌కు 3 నుంచి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని జెన్కో ఇంజనీర్లు చెబుతున్నారు. పెరిగే విద్యుత్ ఉత్పత్తిని ఒడిశాకు పంపించినా మన వాటా విద్యుత్‌ను పెందుర్తి ఫీడర్‌కు సరఫరా అవుతుందని అంటున్నారు. విద్యుత్ కొరత తీరుతుంది ఆధునికీకరణకు నోచుకోక తరచూ ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిన మాచ్‌ఖండ్‌కు ఆధునికీకరణ అనుమతులు సిద్ధం అవడం ఆనందంగా ఉంది. ఇదే జరిగితే 15 మెగావాట్లకు పైబడి ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో విద్యుత్ కొరత తీరుతుంది. – ఎన్.మురళీమోహన్, సీలేరు ఎస్ఈ -
నిలిచిన విద్యుదుత్పత్తి
మాచ్‌ఖండ్‌లో మొరాయిస్తున్న జనరేటర్లు ప్యానెల్ బోర్డులోకి కూలింగ్ వాటర్ ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కూలింగ్ వాటర్ ప్యానెల్ బోర్డులోకి చేరడంతో పంపు కాలిపోయి బుధవారం విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాలం చెల్లిన జనరేటర్ల వల్లే తరచూ ఇక్కడ ఈ పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడి ఆరు జనరేటర్లతో ఒకప్పుడు 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఐదో నంబర్ జనరేటర్ కొంత కాలంగా మూలకు చేరింది. మిగిలిన ఐదింటితోనే నెట్టుకొస్తున్నారు. ఈ నెల 8న కూలింగ్ వాటర్ పంప్ చెడిపోవడంతో 1,2,4,6 నంబర్ల జనరేటర్లలో ఉత్పతి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు అధికారులు 1,2,నంబరు జనరేటర్లను అదే రోజు వినియోగంలోకి తెచ్చారు. 1,2,3 జనరేటర్లతో 51 మెగావాట్లు ఉత్పత్తి చేసేవారు. మంగళవారం ఆరో నంబర్ జనరేటర్‌నూ బాగు చేశారు. దీంతో ఉత్పత్తి 74 మెగావాట్లకు పెరిగింది. ఈ క్రమంలో కూలింగ్ వాటర్ మరోసారి చేరడంతో బుధవారం ప్యానెల్ బోర్డు కాలిపోయింది. విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు ఎస్ఈ ఎం.గౌరీపతి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా కూలింగ్ పంప్ చేడిపోవడంతో ఉత్పతి నిలిచిపోయిందన్నారు. -
ఊపిరి ఆగిన ఫీలింగ్!
డుడుమా జలపాతం పని ఒత్తిడికి తోడు మిత్రుల ఒత్తిడి ఎక్కువైంది. పదిమంది మిత్రులం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నాం. వారం రోజుల కుస్తీ తర్వాత... ఒరిస్సా లోని ‘మాచ్‌ఖండ్’ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లాం. హైదరాబాద్ నుంచి రైల్లో విశాఖ బయల్దేరి, అరకు మీదుగా మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి మాచ్‌ఖండ్‌కు చేరుకున్నాం. రెప్పవాల్చనివ్వని ప్రకృతి అందాలు.. కోరాపుట్ జిల్లాలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో.. రెప్ప వాల్చితే ప్రకృతి అందాలు మిస్ అవుతామేమో అనే ఉత్కంఠకు లోనయ్యాం. అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. మాచ్‌ఖండ్ చేరుకున్నాం. ఈ ప్రాంతం ఉన్నది ఒరిస్సాలోనే అయినా ఇక్కడ చాలా మంది తెలుగువాళ్ళున్నారు. రాత్రి గెస్ట్ హౌజ్‌లో బస, కొండ కోనల్లో విహారం.. వర్ణనకు మాటలు సరిపోవు. డుడుమా జలపాతం... తెల్లవారుజామునే లేచి ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత... ఎదురుగా డుడుమా జలపాతం. ఆ దృశ్యం చూసి ఊపిరి ఒక్కసారి నిలిచిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎత్తయిన కొండలు, వాటి మధ్య కిలో మీటర్లోతు లోయ ప్రాంతం... వాటి మధ్య మూడు జల పాతాలు. అయితే మొదట మనకు కనిపించే జలపాతం సహజ సిద్ధమైంది కాదు. జల విద్యుత్ కేంద్రం నుంచి బయటికి వచ్చే నీటి ద్వారా ఏర్పాటైంది అని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. మిగతా రెండు జలపాతాలు ప్రకృతి సృష్టి. జలపాతాలు లోయలోకి దూకే ప్రాంతాలకు వెళ్ళేందుకు దాదాపు 1800 మెట్లు ఉన్నాయి. ఆలోయలోకి దిగాలంటే వెంట మిత్ర బృందమే కాదు మెండుగా గుండెధైర్యమూ కావాలి. ఆ లోయ జలపాత అందాలు చూశాక... కష్టం దూదిపింజల్లా తేలిపోయింది. ఆ తర్వాత ముందస్తు అనుమతితో పవర్ ప్రాజెక్టును సందర్శించాం. పవర్ ప్రాజెక్ట్... కిలో మీటర్ లోతైన లోయలో ఉన్న ప్రాజెక్టుకు...లోపలికి వెళితే రైల్వే ట్రాక్, ఓ రెండు టాప్ లెస్ బోగీలు కనిపించాయి. అదే వించ్ హౌజ్. 1957లో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ ట్రాక్ నిర్మించారు. ఈ తరహా ప్రాజెక్టు గానీ, ప్రయాణంగానీ ప్రపంచంలో మరెక్కడా లేదని అక్కడ ఓ ఉద్యోగి చెప్పాడు. నిట్టనిలువుగా, లోతుగా ఉన్న లోయలోకి రైలు ప్రయాణం... ఊహించుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. లోయలోకి రైలు ప్రయాణం ద్వారా విద్యుత్ ప్రాజెక్టుకు చేరుకున్నాక, అక్కడ విద్యుత్ ఉత్పత్తి విధానం తెలుసుకున్నాం. ఒరిస్సా సరిహద్దుల్లో సాగిన మా ప్రయాణంలో మరపురాని ప్రకృతి అందాలను కళ్ళనిండా నింపుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యాం. - బందు శ్రీకాంత్ బాబు, సాక్షి టీవీ, హైదరాబాద్