నిలిచిన విద్యుదుత్పత్తి
- మాచ్‌ఖండ్‌లో మొరాయిస్తున్న జనరేటర్లు
- ప్యానెల్ బోర్డులోకి కూలింగ్ వాటర్
ముంచంగిపుట్టు: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కూలింగ్ వాటర్ ప్యానెల్ బోర్డులోకి చేరడంతో పంపు కాలిపోయి బుధవారం విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాలం చెల్లిన జనరేటర్ల వల్లే తరచూ ఇక్కడ ఈ పరిస్థితి నెలకొంటోంది.
ఇక్కడి ఆరు జనరేటర్లతో ఒకప్పుడు 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. ఐదో నంబర్ జనరేటర్ కొంత కాలంగా మూలకు చేరింది. మిగిలిన ఐదింటితోనే నెట్టుకొస్తున్నారు. ఈ నెల 8న కూలింగ్ వాటర్ పంప్ చెడిపోవడంతో 1,2,4,6 నంబర్ల జనరేటర్లలో ఉత్పతి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు అధికారులు 1,2,నంబరు జనరేటర్లను అదే రోజు వినియోగంలోకి తెచ్చారు. 1,2,3 జనరేటర్లతో 51 మెగావాట్లు ఉత్పత్తి చేసేవారు.
మంగళవారం ఆరో నంబర్ జనరేటర్‌నూ బాగు చేశారు. దీంతో ఉత్పత్తి 74 మెగావాట్లకు పెరిగింది. ఈ క్రమంలో కూలింగ్ వాటర్ మరోసారి చేరడంతో బుధవారం ప్యానెల్ బోర్డు కాలిపోయింది. విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రాజెక్టు ఎస్‌ఈ ఎం.గౌరీపతి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా కూలింగ్ పంప్ చేడిపోవడంతో ఉత్పతి నిలిచిపోయిందన్నారు.