Mad woman
-
పిల్లలకు ఎలుకలమందు పెట్టిన తల్లి
సాక్షి, కంకిపాడు: మతిస్థిమితం సరిగా లేక ఓ తల్లి తన పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, తానూ తిన్న సంఘటన మండలంలోని పునాదిపాడులో చోటుచేసుకుంది. ఆత్మహత్యా యత్నం ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పునాదిపాడు గ్రామానికి చెందిన కనకభవానికి మతిస్థిమితం సరిగా లేదు. కనక భవాని పిల్లలు జ్యోతి ప్రసన్న (7), కుమార్ (5). మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఇద్దరూ వాంతులు చేసుకోవటాన్ని స్థానికులు గమనించి తల్లి భవానీని ప్రశ్నించారు. ఎలుకల మందు తెచ్చి భోజనంలో కలిపి పిల్లలకు పెట్టి తానూ తిన్నానని చెప్పింది. వెంటనే తల్లిని, పిల్లలను వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవలు అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు సమాచారం అందింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.దుర్గారావు తెలిపారు. చదవండి: అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. -
మృగాడికి పదేళ్ల జైలు
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి కేసులో తీర్పు విశాఖ లీగల్ : మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేసి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమాన విధిస్తూ నగరంలోని మహిళా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎ.వరప్రసాదరావు మంగళవారం తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామ్మూర్తినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పెంటా లక్ష్మణ్ (30) విజయనగరం జిల్లా సీతానగరం మండలం పరిధిలోని రంగంపేట నివాసి. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో స్వధార్ షెల్టర్ హోంలో కాపాలాదారుడిగా పనిచేసేవాడు. ఈ గృహాన్ని విజయనగరం మహిళ శిశు సంక్షేమశాఖ నిర్వ హిస్తోంది. బాధితురాలు సావిత్రికి (28) మతిస్థితిమితం లోపించడంతో నగరంలోని ప్రభు త్వ మానసిక వైద్య కేంద్రంలో చికిత్స పొందా రు. 2009లో చికిత్స పూర్తయింది. ఆమెకు బంధువులు ఎవరూ లేకపోవడంతో అనాథగా గుర్తించిన అధికారులు విజయనగరం మహిళ శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇచ్చారు. ఆ శాఖ ఆదేశాల మేరకు 2009లో స్వధార్ షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించారు. అక్కడ పనిచేస్తున్న లక్ష్మణ్ ఆమెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో గర్భం దాల్చింది. దీంతో సావిత్రిని అంతం చేయాలని లక్ష్మణ్ ప్రణాళిక రచించాడు. ఇదే అదునుగా వసతి గృహంలో అందుబాటులో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని అయోడిన్ తాగించే విధంగా ఆమెను ప్రేరేపించాడు. మతిస్థితిమితం లేకపోవడంతో అయోడిన్ తాగింది. అపస్మారక స్థితిలో ఉండడంతో వసతి గృహం సిబ్బంది కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ 2010 మార్చి 9న మృతిచెందింది. ఆమె మృతిపై పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భిణి కావడం, అయోడిన్ తాగడం వల్ల మృతిచెందినట్లు నిర్థారించారు. ఈ విషయంపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో నిందితుడు లక్ష్మణ్ కారణమని నిర్థారించారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి లైంగిక దాడికి పాల్పడినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు నేరాల్లో వెయ్యి రూపాయల వంతుల జరిమాన విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు జరగాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. -
కలెక్టర్ చొరవతో అనాథాశ్రమానికి...
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా): మతిస్థితిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతున్న ఒక మహిళ.. కలెక్టర్ చొరవతో అనాథాశ్రమానికి చేరింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో మతి స్థిమితం కోల్పోయిన అనాథ మహిళ ఒకరు తిరుగుతున్నారు. అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కుమారీ ఈ విషయాన్ని గమనించి రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ మహిళను కరీంనగర్‌లోని అనాథ శరణాలయానికి తరలించారు.