మదగలమ్మకు ప్రత్యేక హోమాలు
చిలమత్తూరు : స్థానిక ఎస్సీ కాలనీలో వెలసిన మదగలమ్మకు శుక్రవారం ప్రత్యేక హోమాలు జరిగాయి. అర్చకులు లక్ష్మీనరసింహప్రసాద్, కిశోర్శర్మ, మంజునాథ్ ¶కలశపూజ, పంచామృతాభిషేకాలు, దేవిమూల మంత్రహోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు కదిరెప్ప, లక్ష్మీనరసప్ప, సత్యనారాయణ, కదిరెప్ప తదితరులు తెలిపారు.