మహిళా మావోయిస్టుల లొంగుబాటు
మహిళా మావోయిస్టులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు. ఖమ్మం జిల్లా శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ సతీమణి కరుణతోపాటు మరో మావోయిస్టు మడకం దేవి భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాలతోనే వారు లొంగుబాట పట్టారని ఏఎస్పీ తెలిపారు. వారిపై నమోదైన కేసులను పరిశీలిస్తున్నామన్నారు.