న్యాయం చేయండి
గర్భసంచి శుద్ధి పేరుతో చేసిన వైద్యం వికటించడంతో వివాహిత మృ తి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతిచెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన యువతి బంధువులు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన మరిసెల్వం నాలుగవ కుమార్త్తె సుజితకు అదే ప్రాం తానికి చెందిన మునీంద్రకు 2012 ఆగష్టులో వివాహం జరిగింది. వారికి సం తానం లేకపోవడంతో తిరువళ్లూరులోని స్త్రీల వైద్య నిపుణురాలు విజయలక్ష్మీ వద్ద చికిత్స చేరుుంచుకున్నారు.
పలు చికిత్సలు చేసిన విజయలక్ష్మి గర్భసంచిని శుద్ధి చేయూలని, అందుకు తమ వద్ద సౌకర్యాలు లేవని పేర్కొంటూ ఆవడిలోని గ్రేస్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిం చారు. వారు ఆవడిలోని గ్రేస్ మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో డాక్టర్ లలిత వద్ద 2014 ఫిబ్రవరి 26 నుంచి చికిత్స చేరుుంచుకున్నారు. కొంతకాలం మం దులు వాడిన తర్వాత పోరూర్‌లోని రామచంద్ర ఆస్పత్రికి వెళ్లాలని లలిత వారికి సూచించారు. దీంతో వారు 2014 మార్చి 10న రామచంద్ర వైద్యశాలకు వెళ్లారు. మూడు రోజులు చికిత్స అనంతరం 13న గర్భసంచి శుద్ధి చేసేం దుకు సుజితను తీసుకెళ్లారు.
14వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు సుజిత మరణించింది. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని, ముగ్గురు వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయూలని కోరుతూ సోమవారం కలెక్టర్ వీరరాఘవరావుకు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఆర్డీవో విచారణ చేపట్టాలని సుజిత తండ్రి మరిసెల్వం కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.