madanpalli
-
ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే!
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్, ఆస్మా, కాశీం(10), ముస్తాక్ (12)ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృత దేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. పోలీసులు క్రేన్ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన రఫీ, జాఫర్, దస్తగిరి కుటుంబాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు.. నజీరాబి(65), దస్తగిరి(50), అమ్మాజాన్(46), సమీరా(16), అమీరూన్(15), రఫి(36), మస్తానీ(30), రయాన్(1), జాఫర్ వలి(32), రోషిణి(25), నౌజియా(34), అమీర్జాన్(63), డ్రైవర్ నజీర్(55), మెకానిక్ షఫి(38). చదవండి: కర్నూలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి -
నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు
మదనపల్లి: చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది. ఈ సంఘటనలో వెంకటరమణ(15) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ముందుచూపు లేకనే ఆర్థిక ఎమర్జెన్సీ
మదనపల్లి: ప్రధాని నరేంద్రమోడీకి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని సీపీఐ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఇండియన్ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ ఏరియా కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ నల్లధనాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశ్యంతో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతిస్తారని, అయితే ప్రత్యామ్నాయం లేకుండా చేసిన చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. -
కార్మిక నేత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
మదనపల్లి: చిత్తూరు జిల్లాలో కార్మిక నాయకుడి హత్య కేసులో ఐదుగురు నిందితులను మదనపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతరవి అనే వ్యక్తి మగ్గాల వ్యాపారి నాగరాజు వద్ద గతంలో పని చేస్తూ రూ.3 లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చకుండా బయటకు వచ్చి కార్మిక నేతగా ఎదిగాడు. దీంతో రవి హత్యకు నాగరాజు కుట్ర పన్నాడు. గత నెల 31న మదనపల్లి సమీపంలో రవి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు కాగా, నాగరాజు సహా నిందితులంతా పరారయ్యారు. ఈ క్రమంలో వెంకటశివారెడ్డి, నారుగట్టువారిపల్లి, జగదీశ్వర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, నాగార్జునరెడ్డి సోమవారం సాయంత్రం కురబలకోట వీఆర్వో వద్ద లొంగిపోయారు. వీఆర్వో వారిని పోలీసులకు అప్పగించగా మంగళవారం అరెస్ట్ చూపించారు. కాగా, ప్రధాన నిందితుడు నాగరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు.