రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: కర్ణాటక రాష్ట్రం తుమకూర్ జిల్లా మధుగిరి తాలుకాలోని మిడిగేశి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన రంగప్ప కుమారుడు నాగరాజు(30) అక్కడిక్కడే మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడు బెంగళూరులోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తుండే వాడన్నారు. శనివారం మధ్యాహ్నం బైక్‌లో కదిరేపల్లి గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలోని మిడిగేసి సమీపంలో పావగడ నుంచి తుమకూర్‌కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నడంతో నాగరాజు మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.