breaking news
Madharaasi Movie
-
ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?
ఈ వీకెండ్ థియేటర్లలోకి మూడు సినిమాలొచ్చాయి. వీటిలో అనుష్క 'ఘాటీ', శివకార్తికేయన్ 'మదరాసి', లిటిల్ హార్ట్స్ అనే చిన్న చిత్రం ఉన్నాయి. అయితే అనుహ్యంగా అనుష్క మూవీకి తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు మదరాసి చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. మరి తొలిరోజు వసూళ్లు ఏ చిత్రానికి ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)తొలుత ఘాటీ విషయానికొస్తే.. చాన్నాళ్ల తర్వాత అనుష్క లీడ్ రోల్లో ఈ మూవీ చేసింది. తూర్పు కనుమల్లో గంజాయి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రిలీజ్‌కి ముందు వరకు బాగానే హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ మరీ పేలవంగా ఉందనే టాక్ రావడం దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చు. అనుష్క తప్పితే పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోవడం జనాల్ని థియేటర్లలోకి రప్పించలేకపోయింది. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.2.89 కోట్ల కలెక్షన్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు ఏఆర్ మురుగదాస్-శివకార్తికేయన్ కలిసి చేసిన 'మదరాసి'పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే ఈ దర్శకుడు హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. కాస్తోకూస్తో హైప్ హీరో వల్ల ఏర్పడింది. దానికి తోడు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడం దీనికి ప్లస్ అయింది. దీంతో మొదటిరోజు 'మదరాసి' చిత్రానికి రూ.13 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)మరోవైపు మౌళి అనే యూట్యూబర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేశారు. అక్కడి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అలానే రీసెంట్ టైంలో మొదటిరోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగానూ ఇది నిలిచినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఎవరి జాతకం ఏంటనేది పూర్తిగా తేలుతుంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) -
శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. గత కొన్నేళ్లలో ఘోరమైన డిజాస్టర్స్ ఇచ్చాడు. ఈ ఏడాది 'సికిందర్' అనే హిందీ మూవీ చేశాడు గానీ ఇది ఫెయిల్ కావడానికి హీరో సల్మాన్ ఖాన్ కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 'మదరాసి' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?తమిళనాడులో గన్ కల్చర్ తీసుకురావాలనేది విరాట్(విద్యుత్ జమ్వాల్) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్లాన్. ఇందులో భాగంగా గన్స్ ఉన్న ఆరు కంటెయినర్లని రాష్ట్రంలోకి తీసుకొస్తుంటాడు. ఈ సంగతి ఎన్ఐఏ(NIA)కి తెలుస్తుంది. ఆఫీసర్ ప్రేమ్(బిజు మేనన్).. తన టీమ్‌తో కలిసి వీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెద్ద గొడవ. ఆఫీసర్ ప్రేమ్ తీవ్ర గాయాలపాలవుతాడు. మరోవైపు లవ్ ఫెయిలైందని రఘు(శివకార్తికేయన్) ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఫ్లైఓవర్ పై నుంచి దూకేస్తాడు. ఇతడికీ గాయాలవుతాయి. అనుకోకుండా ప్రేమ్-రఘని ఒకే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తారు. తర్వాత ప్రేమ్ లీడ్ చేస్తున్న మిషన్‌లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? రఘు ప్రేమించిన మాలతి (రుక్మిణి వసంత్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఏఆర్ మురుగదాస్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఇతడిపై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. కానీ 'మదరాసి'పై కాస్తోకూస్తో హైప్ ఉందంటే అదంతా హీరో శివకార్తికేయన్ వల్లే. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే బాగుంది అంతే. మరీ సూపర్ కాదు, అలా అని తీసిపారేయదగ్గ మూవీ కాదు. పోలిక కాదు గానీ మురుగదాస్ గతంలో తీసిన 'తుపాకీ' గుర్తొస్తుంది. బహుశా రెండింటిలోనూ ఒకే విలన్ ఉండటం వల్లే ఏమో!'మదరాసి'లో విలన్‌కి హీరోకి ఏ మాత్రం సంబంధం ఉండదు. తనకున్న సమస్యతో తన బాధేదో తను పడుతుంటాడు. అలాంటి హీరో.. ఎన్ఐఏ అధికారులతో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో తీశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా సినిమా తీయాలని ఫిక్సయ్యారు. లవ్‌స్టోరీ కూడా పెట్టారు కానీ ఇదెందుకో అంతగా అతకలేదు. లవ్ సీన్స్ అన్నీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫస్టాప్ బాగుంటుంది. హై మూమెంట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. స్టోరీ తక్కువైంది. కానీ చూడటానికి బాగానే ఉంటుంది. సెకండాఫ్ మధ్యలోనే స్టోరీ అయిపోతుంది. కానీ అక్కడి నుంచి మరో అరగంట సినిమా సాగుతూ వెళ్తుంది. మురుగదాస్ గత చిత్రం 'సికిందర్'తో పోలిస్తే ఇది పర్వాలేదనిపిస్తుంది. స్టోరీలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా చూసేటట్టుగానే ఉంటుంది. అనుకున్న పాయింట్ చెప్పడంలో టీమ్ అంతా పర్లేదు సక్సెస్ అయ్యారు. కాకపోతే మరీ అంత ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉండదు.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది శివకార్తికేయన్ మాత్రమే. ఇతడి క్యారెక్టర్ డిజైన్ బాగుంటుంది. అలానే శివకార్తికేయన్‌లో టిపికల్ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ మూవీలో అక్కడక్కడ ఉపయోగించుకున్నారు. రుక్మిణి వసంత్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించింది. స్క్రీన్ పై ఈమె అందంగా కనిపించింది. విలన్స్ విరాట్-చిరాగ్గా విద్యుత్ జమ్వాల్, షబ్బీర్ బాగానే చేశారు. మంచి ఎలివేషన్స్ పడ్డాయి. బిజు మేనన్.. ఎన్ఐఏ ఆఫీసర్‌గా బాగానే చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే.. పాటలు అస్సలు బాగోలేవు. లిరిక్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదనిపించింది. కానీ అనిరుధ్ మార్క్ కనిపించలేదు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్‌గా ఏఆర్ మురుగదాస్.. ఈ సినిమాతో కాస్త కుదురుకున్నాడు. కానీ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది. అలానే టైటిల్ పడేటప్పుడు తమిళనాడు మ్యాప్ తప్పుగా చూపించారు. అందులో దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా తమిళనాడులో కలిపేసి చూపించారు. మరి టీమ్ ఇది తెలిసి చేసిందా? తెలియక చేసిందా? అనేది అర్థం కాలేదు.- చందు డొంకాన -
అందుకే మదరాసి టైటిల్ పెట్టాను: ఏఆర్ మురుగదాస్
‘‘మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ‘మదరాసి’ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఈ మూవీలో హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు విలన్. అందుకే టైటిల్ ‘మదరాసి’ అని పెట్టాను’’ అని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెలిపారు. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జోడీగా విద్యుత్ జమాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘వెస్ట్రన్ కంట్రీస్‌లో ఇప్పటికే ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ‘మదరాసి’ కథ రాశాను. ఈ కథ మొత్తం తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అయినప్పటికీ ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మాస్లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది. విద్యుత్ జమాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. అయితే ‘మదరాసి’ కథ నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ ఎన్వీ ప్రసాద్‌గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. దక్షిణాది ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రస్తుతం మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుండటం సంతోషం. ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ, చివరకు అది పట్టాలెక్కలేదు. అందువల్లే దాదాపు ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అందుకే తెలుగు సినిమాలకు రూ. 1000 కోట్లు వస్తున్నాయి : శివ కార్తికేయన్
‘‘నా సినిమాలు ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’, ‘మహావీరుడు’, ‘అమరన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మదరాసి’(Madharaasi ) సినిమాను కూడా ఆదరించాలి. విజయం కంటే మీరు (ప్రేక్షకులు) చూపించే ప్రేమే నాకు చాలా ప్రత్యేకం’’ అని శివ కార్తికేయన్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ , రుక్మిణీ వసంత్ జోడీగా నటించిన చిత్రం ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. (చదవండి: ఈ వ్యక్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్)హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కార్తికేయన్(Sivakarthikeyan) మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, మహేశ్బాబుగార్లను డైరెక్ట్ చేసిన మురుగదాస్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు మంచి కంటెంట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. నిర్మాతగా ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం.. అందుకే తెలుగులో తరచుగా వెయ్యికోట్ల కలెక్షన్స్ రాబడుతున్న చిత్రాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.(చదవండి: ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ) ‘‘మా సినిమా ఆరంభంలో రుక్మిణి అప్‌కమింగ్ హీరోయిన్ . కానీ, ఇప్పుడు ఎన్టీఆర్– ప్రశాంత్‌నీల్ సినిమా, యశ్ ‘టాక్సిక్’, రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ వంటి చిత్రాలు చేస్తున్నారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ‘‘మదరాసి’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రుక్మిణీ వసంత్. -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ చిన్న సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో డబ్బింగ్ చిత్రం 'కొత్త లోక'.. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవి తేలిపోయాయి. మరోవైపు ఈసారి అనుష్క శెట్టి చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన 'ఘాటీ' విడుదలకు సిద్దమైంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ 'మదరాశి' రాబోతుంది. దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే హీరో శివకార్తికేయన్ అయినాసరే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కావడమే దీనికి కారణం. ఇది కాకుండా 'లిటిల్ హార్ట్స్' ఓ తెలుగు మూవీ కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)మరోవైపు ఓటీటీల్లోనూ మరీ ఎక్కువ సినిమాలేం రావట్లేదు. 10కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇన్స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ అయ్యేసరికి కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ఇన్స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05హాట్స్టార్ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 03అమెజాన్ ప్రైమ్ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01సన్ నెక్స్ట్సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీహైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)