సెలబ్రిటీ అయి కూడా సమస్యలు ఎదుర్కొన్నా: మధుప్రియ
సెలబ్రిటీ స్టేటస్ ఉండి కూడా తాను ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అమ్మానాన్నలను ఒప్పించడానికి చాలావరకు ప్రయత్నించి, ఇక చేతకాక చేతులెత్తేసిన పరిస్థితుల్లోనే తాను శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నానని గాయని మధుప్రియ చెప్పింది. పెళ్లయిన తర్వాత తొలిసారిగా 'సాక్షి టీవీ'కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించింది. మధుప్రియ ఇంకా ఏం చెప్పిందంటే...
మధుప్రియ ఇలా ఎందుకు చేస్తుంది అని అందరూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు
ఏదైనా ఒక మేటర్ దొరికితే సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది
అయితే అమ్మాయిని బద్నాం చేసేముందు ఒక్కసారి ఆమె ఎందుకిలా చేయాల్సి వచ్చిందో ఆలోచించండి
నాకు తెలిసి నేను చేసింది తప్పు కాదు
అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను
అంతకంటే ఎక్కువ అడగలేను అన్నంతగా రిక్వెస్ట్ చేసి, ఫలితం లేక చేతులెత్తేయాల్సి వచ్చింది
అమ్మానాన్నలను నేను మోసం చేయలేదు, వారికి ద్రోహం చేయలేదు
శ్రీకాంత్‌తో నాకు రెండేళ్ల నుంచి పరిచయం. న్యూ నల్లకుంటలో ఉండేవారు.
మా ప్రేమ గురించి అమ్మానాన్నలకు ముందే చెప్పాను.
ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి కూడా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను
తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది
కెరీర్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు
శ్రీకాంత్ ఫేమస్ కాదు.. మావాళ్లకు అతను పేద అబ్బాయి కదా అనే ఆలోచన ఉంది. నాకు మాత్రం అలాంటిదేమీ లేదు.
మా అమ్మా, నాన్నల తర్వాత బాగా చూసుకోగలిగే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను
ప్రస్తుతం నేను ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం చదువుతున్నాను.
నా గోల్స్ ఏంటో శ్రీకాంత్‌కు కూడా తెలుసు. తను నాకు సపోర్ట్ చేస్తాడు
కొన్నాళ్ల తర్వాత మళ్లీ అమ్మానాన్న మళ్లీ మాట్లాడుతారనే అనుకుంటున్నాను
పెళ్లి చేసుకోవడం చాలా సంతోషం, అమ్మానాన్నలను వదులుకోవడం చాలా బాధాకరం
భవిష్యత్తులో ఏం చేస్తానో నాకు తెలీదు. కాలానికే వదిలిపెడుతున్నాను
లాయర్ అవుతానో లేదో మాత్రం అప్పుడే చెప్పలేను
పెళ్లయిన తర్వాత కూడా నూటికి నూరుశాతం పాటలు పాడుతూనే ఉంటాను
గడిచిన నెల రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాను
అప్పటి నుంచి రెండువైపులా సమస్యలు వస్తూనే ఉన్నాయి
అమ్మా నాన్న ఒప్పుకొంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు
మమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి
నేను ముందే పోలీసుల దగ్గరకు రాలేదు.. పరిస్థితి బాగా ఇబ్బంది అయ్యాక కాగజ్‌నగర్ డీఎస్పీ వద్దకు వచ్చాను
అమ్మానాన్నల మైండ్‌సెట్ వల్లనే నేను ఇలా మారాల్సి వచ్చింది