madhu yaski
-
‘మిషన్ భగీరథే ఆ కుటుంబానికి బతుకుదెరువు’
సాక్షి, హైదరాబాద్ : ‘మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారింది.. అందుకే రైతుల పొలాలను ఎండబెట్టి మరి ఈ ప్రాజెక్ట్‌కు నీటిని కేటాయిస్తున్నార’ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా కాకతీయ కెనాల్ కింద కోరుట్ల, బాల్కొండ పరిధిలోని 20కి పైగా గ్రామాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఎగువన ఎస్సారెస్పీలో 16 టీఎంసీల నీరున్నా.. రైతుల పొలాలకు నీళ్లు వదలకుండా, ప్రభుత్వం కావాలనే వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నీళ్ల కోసం రైతులు ఆందోళన చేయకుండా ఉండేందుకు ఇప్పటికే ఎస్సారెస్పీ పరిసర గ్రామాల్లో భారీగా పోలీసుల బలగాలను మోహరించి, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు . కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలైనా గజ్వేల్, సిద్ధిపేటకు నీటిని వదలడం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం, కోరుట్ల స్థానిక మంత్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, ఎంపీ కవిత స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుకున్నది కేవలం అర టీఎంసీ నీరు మాత్రమే.. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల గోడును పట్టించుకోకుండా ఆ నీటిని మిషన్ భగీరథకు తరలిస్తుందన్నారు. కారణం ఈ ప్రాజెక్ట్ కల్వకుంట్ల కుటుంబానికి బతుకుదెరువుగా మారిందని ఆరోపించారు. తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మొక్కుకు అమరులను ఎందుకు తీసుకెళ్లలేదు: మధు యాష్కీ
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తిరుమలలో చెల్లించే మొక్కుకు అమరవీరులను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ మధు యాష్కీ. ఆస్తులు కూడబెట్టడానికే కేసీఆర్ కుటుంబం పరిమితమైదని విరుచుకుపడ్డారు. కోదండరాం ఇంటి తలుపులు బద్ధలు గొట్టడం సీఎం దొరతనానికి నిదర్శమన్నారు. -
మహారాష్ట్రకు తాకట్టు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి జగ్గా రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. రైతుల ఉసురు పోసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు పాపం తగులుతుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టులు తీర్పు ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గులేకుండా అప్పీలుకు వెళ్తోందన్నారు. -
ఎక్కడ ఉన్నా.. తెలుగువారంతా ఒక్కటే
- రెండో రోజూ అంగరంగ వైభవంగా ఆటా ఉత్సవాలు - బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం - హాజరైన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాయికల్ : ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రా ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని షికాగోలో ఆటా రజతోత్సవాలు రెండో రోజు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు సాగాయి. కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి, సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు. జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగిం చారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అలరించింది. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బోనాలతో సభావేదికపైకి చేరుకోవడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, ఆటా సంఘం అధ్యక్షుడు పెర్కారి సుధాకర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.