Madhura Sreedhar
-
స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు
‘‘మనకు థియేటర్స్ ఎక్కువైపోయాయి.. ఫీడింగ్ తక్కువైంది. చిన్న సినిమాలకు మంచి రోజులొచ్చాయి. ఎగ్జిబిటర్స్ అందరూ చిన్న సినిమాలవైపే చూస్తున్నారు. పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దొరసాని’. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొయెటిక్, మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాం. 1980లో తెలంగాణ ఎలా ఉంది? గడి సంస్కృతి ఏంటి? అనే విషయాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో అచ్చం తెలంగాణ వాతావరణం కనిపించిందంటున్నారు. పాత కాలాన్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. పౌడర్ డబ్బా కోసమే 4–5 నెలలు తిరిగాం. 14లక్షలు పెట్టి గడిని బాగుచేయించి షూట్ చేశాం. మరో 5 లక్షలు ఆ ఊరి అభివృద్ధి కోసం అందించాం. ఈ చిత్రంతో 60మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. ఓపెనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ మ్యాట్నీ నుంచి కలెక్షన్లు పెరిగాయి. ఇంతకుముందు వచ్చిన తెలుగు గొప్ప ప్రేమకథలు తీసుకుంటే తెలుగు దర్శకులు తీసినవి తక్కువ. ఆనంద్, శివాత్మిక కావాలనుకుంటే మంచి గ్లామర్ ఉన్న సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంలోనే ఆర్టిస్ట్‌గా వాళ్ల నిబద్ధత, నిజాయతీ తెలుస్తోంది. కమర్షియల్ అంశాలు జోడించి ఈ స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు. ప్రేక్షకుల్లో టాక్ బాగుంది. పాజిటివ్ టాక్ని మించిన ప్రమోషన్ ఏంటి? సోషల్ మీడియాలో కవిత్వాలు రాస్తున్నారు. నాలుగు వారాలుగా మంచి సినిమాలు రావడం శుభ పరిణామం. కొత్త సినిమా ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. ఆనంద్ దేవరకొండతో మరో సినిమా, మహేంద్రతో ఓ సినిమా చేస్తాం’’ అన్నారు. -
తగ్గించాక బాగుందంటున్నారు
‘‘మనకు తెలిసిన సూపర్ హిట్ సినిమాల్లో కూడా తప్పులు, లోపాలు ఉంటాయి. ఒక సినిమాను వంద శాతం అందరికీ నచ్చేలా రూపొందించడం సాధ్యం కాదు. ‘ఒక మనసు’ కొందరికి బాగా నచ్చింది. మరికొందరు ఫర్వాలేదంటున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ అన్నారు. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఒక మనసు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సంతృప్తినిచ్చిందని సోమవారం విలేకరుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ అన్నారు. మరిన్ని విశేషాలను ఆయన ఈ విధంగా చెప్పారు. ‘ఒక మనసు’కి తొలుత మిశ్రమ స్పందన వచ్చినా... ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి. సినిమా మొదటి అర్ధ భాగంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని అనిపించింది. వాటిలో 14 నిమిషాల నిడివి కత్తిరించాక సినిమా బాగుందంటున్నారు. మల్టీప్లెక్స్‌లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. నీహారిక, నాగశౌర్యల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నీహారికతో మంచి సినిమా చేశారనే ప్రశంసలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. దర్శకుడిగా రామరాజు శక్తివంచన లేకుండా ఈ సినిమా రూపొందించారు. నా తదుపరి చిత్రం కూడా ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది. విషాదాంత కథలు మన ప్రేక్షకులకు నచ్చవనే అభిప్రాయం ఉంది. వేరే నిర్మాతలైతే ధైర్యం చేసేవారు కాదేమో. కథే మాకు ఈ సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చింది. విడుదలకు ముందు ‘ఒక మనసు’ను ‘మరో చరిత్ర’, ‘గీతాంజలి’ లాంటి సినిమాలతో పోల్చడం నాకు తప్పేమీ అనిపించలేదు. ఎందుకంటే మేము ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకున్నాం. మిగతా భాషల్లో భిన్నమైన సినిమాలను ఆదరిస్తున్నప్పుడు మనమెందుకు అలాంటివి చేయకూడదని అనిపించింది. నచ్చిన కథలు దొరక్కే దర్శకత్వానికి దూరంగా ఉంటున్నా. నా దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ప్రారంభిస్తా. -
అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్
‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్‌కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్‌లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు. -
క్రికెట్ కుంభకోణాలపై సినిమా..!